- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Telangana News: మరోసారి తెరపైకి వర్గపోరు.. అది కావాలనే చింపేశారా?
దిశ,కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం నియోజకవర్గంలో రోజు రోజుకి టీఆర్ఎస్ వర్గ పోరు తారాస్థాయికి చేరుతుంది. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవన్న సామెతకు అద్దం పట్టినట్లుగా వ్యవహరిస్తున్నారు కొంతమంది టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు. కొత్తగూడెం నియోజకవర్గంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు వర్గం,రేగా కాంతారావు వర్గం,పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గం,పువ్వాడ అజయ్ వర్గం అంటూ ద్వితీయ స్థాయి ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు కొంతమంది గ్రూపులు కడుతున్నారు. నిన్న మొన్నటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉండే ఈ వర్గ పోరు కాస్త చైర్పర్సన్ సీతాలక్ష్మి ఘటనతో తార స్థాయికి చేరుకుంది. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు సారధ్యంలో చేపట్టిన బైక్ ర్యాలీలో చైర్పర్సన్ సీతాలక్ష్మి పై కౌన్సిలర్ భర్త ఆకతాయిల్లా వ్యవహరించారంటూ చైర్ పర్సన్ బొల్లుమని ఏడుస్తూ తనను అవమానానికి గురిచేసిన వారిని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని హైకమాండ్‌కు సైతం ఫిర్యాదు చేశారు. సీతా లక్ష్మి ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీస్ స్టేషన్లో వారిపై కేసు నమోదు చేశారు. వ్యవహారం ఇంతటితో సద్దుమణిగింది అనుకునేలోపే ఫ్లెక్సీల రగడ మొదలైంది. కొత్తగూడెం అండర్ బ్రిడ్జిపై చైర్ పర్సన్ సీతా లక్ష్మి, ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఫోటోలతో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగును గుర్తుతెలియని వ్యక్తులు చింపేశారు. కేవలం ఓటింగ్‌లో ఉన్న చైర్పర్సన్ సీతాలక్ష్మి ఫోటో ఉన్నంతవరకే చెప్పడంతో చైర్పర్సన్ వర్గీయులు కావాలనే ఈ పని చేసి ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. మనిషి పై ఉన్న కోపాన్ని ఫ్లెక్సీలపై చూపుతున్నారంటూ మండిపడుతున్నారు. కాకపోతే ఈ ఘటన కాకతాలీయంగా జరిగిందా కావాలనే ఎవరైనా చింపేశారా అన్న విషయం తెలియాల్సి ఉంది.