- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
Yamudu: ‘అపరిచితుడు’ కాన్సెప్ట్‌తో మరో చిత్రం.. భయపెడుతోన్న పోస్టర్
దిశ, సినిమా: జగన్నాధ పిక్చర్స్ (Jagannadha Pictures) పతాకంపై జగదీష్ ఆమంచి (Jagadeesh Amanchi) హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వం వహించిన సినిమా ‘యముడు’ (Yamudu). ‘ధర్మో రక్షతి రక్షితః’ అనే ఉప శీర్షిక (subtitle)తో తెరకెక్కుతోన్న ఈ థ్రిల్లర్ (Thriller) చిత్రం షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ (complete) కాగా.. ప్రజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ (Post Production) పనుల్లో బిజీగా ఉన్నా మూవీ టీమ్ (Movie Team) డిసెంబర్‌లో ‘యముడు’ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా విడుదల చేశారు. పోస్టర్‌లో హీరో వెనుక యముడు రూపంలో కోపంగా ఓ భయంకర ఆకారం కనిపిస్తుండటంతో.. సినిమాపై క్యూరియాసిటీ పెరుగుతోంది.
పోస్టర్ రిలీజ్ అనంతరం నిర్మాత రాజ్ కందుకూరి (Raj Kandukuri) మాట్లాడుతూ ‘‘యముడు’ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది. ఈ కథ చాలా ఇంట్రెస్టింగ్ (Interesting)గా ఉంది. మంచి కథ ప్రేక్షకులకి ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ రోజుల్లో ప్రేక్షకులు చిన్న సినిమా, కొత్త సినిమా అని చూడటం లేదు. కథ బాగుంటే సూపర్ హిట్ (Super Hit) చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జగదీష్ ఆమంచి బాగా చేసుంటారు అని నమ్ముతున్నాను. మంచి హిట్ కావాలని కోరుకుంటున్నాను’ అని తెలిపారు.
హీరో, దర్శకుడు నిర్మాత జగదీష్ ఆమంచి మాట్లాడుతూ.. ‘మా ‘యముడు’ ఫస్ట్ లుక్‌ను విడుదల చేసిన నిర్మాత రాజ్ కందుకూరికి ధన్యవాదాలు. ఇక కథ విషయానికి వస్తే సామాన్య ధర్మం పాటించకుండా సమాజానికి కీడు చేసే వాళ్ళకి యముడు ప్రత్యక్షమై గరుడ పురాణం (Garuda Purana) ప్రకారం శిక్షలు వేస్తుంటాడు. యముడు ఎందుకు ఆలా చేస్తాడు చివరికి ఏమవుతుంది అనేదే చిత్ర కథ. 2005 లో శంకర్ (Shankar) దర్శకత్వంలో హీరో విక్రమ్ నటించిన ‘అపరిచితుడు’ (Aparichithudu) చిత్రం లాగే అదే కాన్సెప్ట్‌లో మా సినిమా కూడా ఉంటుంది. తెలుగు ప్రేక్షకులందరికీ కచ్చితంగా నచ్చుతుంది’ అని చెప్పుకొచ్చారు. కాగా.. ఈ సినిమాలో జగదీష్ ఆమంచితో పాటు శ్రావణి శెట్టి, ఆకాశ్ చల్లా, అనిత రాజ్ తదితరులు నటిస్తున్నారు.