మానవత్వం మరచిన తండ్రి.. కన్నకూతురిపైనే అత్యాచారం

by samatah |
మానవత్వం మరచిన తండ్రి.. కన్నకూతురిపైనే అత్యాచారం
X

దిశ,కంటోన్మెంట్ : కన్న తండ్రి మానవత్వాన్ని మరిచాడు. కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన కన్నకూతురిపైనే అత్యాచారానికి ఒడి గట్టిన కీచక తండ్రి కటకటాల పాలయ్యాడు. ఈ అమానుష సంఘటన బోయిన్ పల్లి పీఎస్ పరిధిలో చోటు చేసుకుంది. బేగంపేట ఏసీసీ నరేశ్ రెడ్డి, బోయిన్ పల్లి సీఐ రవికుమార్‌తో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను వెల్లడించారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రమేష్ అనే వ్యక్తి బతుకుదెరువు నిమిత్తం బోయిన్పల్లిలో నివాసం ఉంటూ కూలీ పనులు చేస్తూ జీవనం సాగిస్తంటాడు. ఇదే క్రమంలో అతని మొదటి భార్య విడాకులు ఇచ్చి వేరే వ్యక్తిని వివాహం చేసుకుంది. అప్పటికే వారికి కుమార్తె ఉంది. మొదటి భార్య కూతురు తండ్రి వద్దనే ఉంటుంది. కాగా, రమేష్ మొదటి భార్యతో విడాకులు అనంతరం మరో మహిళను వివాహం చేసుకుని జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే తనతో పాటు ఉంటున్న మొదటి భార్య కూతురును బెదిరించి ఆమె పై పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బయట ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించి వాడని పోలీసులు తెలిపారు. దీంతో ఈ సంఘటనను గమనించిన రమేష్ రెండవ భార్య పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు రమేష్‌ను అరెస్టు చేసి, విచారించారు. నేరాన్ని ఒప్పుకోవడంతో నింధితుడిని రిమాండ్ కు తరలించారు.

Advertisement

Next Story