- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మాయదారి కాల్వ రైతు ప్రాణమే తీసింది
దిశ, రామడుగు : మాయదారి కాలువతో భూమి మునిగిపోతుందని ఆవేదనతో రైతు ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఆసుపత్రిలో కొట్టుమిట్టాడుతూ నేడు తుది శ్వాస విడిచాడు. వివరాల్లోకి వెళితే రామడుగు మండలం శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన ఒంటెల రాఘవరెడ్డి (52) గతంలో వరద కాలువ భూసేకరణలో భాగంగా మూడు సార్లు వ్యవసాయ భూమిని కోల్పోయాడు. ఇప్పుడు మళ్లీ చేపడుతున్న అదనపు టీఎంసీ (ఓ టి) కాలువ భూసేకరణలో భాగంగా మళ్లీ రాఘవరెడ్డి భూమి కోల్పోతున్నాడు అనే వార్త వినడం తో మనోవేదనకు గురై బుధవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు కరీంనగర్లోని ఆసుపత్రికి తరలించారు. ఈ క్రమంలో పోలీసులు వచ్చి రైతుకు ధైర్యం చెప్పారు. కానీ ఆవేదనను తట్టుకోలేక పరిస్థితి విషమించి గురువారం తుది శ్వాస విడిచాడు. ప్రభుత్వం వారి కుటుంబాన్ని ఆదుకోవాలని గ్రామస్తులు, కుటుంబ సభ్యులు వేడుకున్నారు.