భలే అభిమానులు.. అలియా, రణబీర్ విగ్రహాలకు వివాహం.. ఎలా అంటే ?

by samatah |
భలే అభిమానులు.. అలియా, రణబీర్ విగ్రహాలకు వివాహం.. ఎలా అంటే ?
X

దిశ, వెబ్‌డెస్క్ : బాలీవుడ్ లవ్ బర్డ్స్ రణబీర్ కపూర్, అలియా భట్ రెండు రోజుల క్రితం ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్‌లో వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇక నాలుగేళ్లకు పైగా డేటింగ్‌లో ఉన్న ఈ జంట ఎట్టకేలకు కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. అయితే అలియా, రణబీర్ వివాహం కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు. ఇక చివరకు వారు వివాహం చేసుకోవడంతో అభిమానుల ఆనందం మాటల్లో చెప్పలేనిది. వారి పెళ్లి పట్ల అభిమాన నటులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.




ఇక ఇదిలా ఉండగా.. కొంత మంది అభిమానులు మాత్రం ఏకంగా రణబీర్, అలియాకు వివాహం చేశారు. అది ఎలా అనుకుంటున్నారా ?.. రణబీర్, అలియా విగ్రహాలకు, ఆచారా వ్యవహారాల ప్రకారం వివాహం జరిపించారు. అంతే కాకుండా వారి విగ్రహాలకు అభిమానుల చేత ఊరేగింపుకూడా చేశారు. ప్రస్తుతం ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.





Advertisement

Next Story