Facebook: ఎఫ్‌బీలో ఒకే ఎకౌంట్‌కు 'ఐదు ప్రొఫైల్స్' జతచేసే అవకాశం!

by Manoj |   ( Updated:2022-07-15 09:45:43.0  )
Facebook to allow five Profiles On single Account
X

దిశ, ఫీచర్స్ : Facebook to allow five Profiles On single Account| ఫేస్‌బుక్‌ వినియోగదారులు ఇకపై ఒకే ఎకౌంట్‌‌పై ఐదు ప్రొఫైల్స్‌ను నిర్వహించుకోవచ్చని మెటా కంపెనీ తాజాగా ప్రకటించింది. యూజర్ల సౌలభ్యం కోరకు ఈ ఫెసిలిటీ అందుబాటులోకి తీసుకురాగా.. తమ ప్లాట్‌ఫామ్‌పై యూజర్ ఎంగేజ్‌మెంట్‌ పెంచే ప్రయత్నంలో ఇది భాగమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఫేస్‌బుక్ సభ్యులు ఇకపై తమ ప్రొఫైల్‌తో పాటు మరో 4 అదనపు ప్రొఫైల్‌లను సృష్టించుకునే అవకాశం ఉంది. ప్రతీ ఒక్కరూ తమ అసలు పేరు లేదా ఐడెంటిటీని చేర్చాల్సిన అవసరం లేదు. స్నేహితులు, సహోద్యోగులు, కుటుంబ సభ్యుల కోసం ఇలా ఒక్కో విధంగా ప్రొఫైల్ మెయింటెన్ చేయొచ్చు. ఎఫ్‌బీ అందిస్తున్న ఈ సౌకర్యంతో సదరు యూజర్స్ తమ తమ ఆసక్తులు, రిలేషన్‌షిప్స్ ఆధారంగా వారి ఎక్స్‌పీరియన్స్ షేర్ చేసుకునేందుకు, వివిధ రకాల కంటెంట్‌ను పోస్ట్ చేయడంలో సాయపడనుంది. అయితే ఫేస్‌బుక్ నిబంధనల ప్రకారం ఈ అదనపు ప్రొఫైల్స్ వినియోగదారుడి ప్రధాన ఖాతాకు తిరిగి జతచేయబడతాయి. ఈ మేరకు ప్రతీ వినియోగదారుడికి ఒక ఫేస్‌బుక్ ఎకౌంట్ మాత్రమే ఉండాలని, ఆ ఖాతాకు లాగిన్ చేసిన తర్వాతే వ్యక్తులు సృష్టించే ఏవైనా అదనపు ప్రొఫైల్స్ యాక్సెస్ చేయగలరని మెటా పేర్కొంది.

టిక్‌టాక్, ట్విట్టర్, అలాగే మెటాకు చెందిన ఫొటో, వీడియో యాప్ ఇన్‌స్టాగ్రామ్ వంటి పోటీదారులు అందించే ఎంపికలకు అనుగుణంగా, ఎఫ్‌బీ కూడా తమ యూజర్ల గుర్తింపును సెమీ-అనొనిమైజ్(అజ్ఞాతీకరించడం) వెసులుబాటు కల్పించింది.

ఇది కూడా చదవండి: స్మార్ట్ ఫోన్‌లో ఉండే ఈ ట్రిక్ తెలుసా...? చాలా ఈజీ

Advertisement

Next Story