బిడ్డకు పాలిస్తున్న ఫొటోను షేర్ చేసిన నటి.. మాతృత్వపు మాధుర్యాన్ని చూడాలంటూ

by Harish |
బిడ్డకు పాలిస్తున్న ఫొటోను షేర్ చేసిన నటి.. మాతృత్వపు మాధుర్యాన్ని చూడాలంటూ
X

దిశ, సినిమా: బాలీవుడ్‌ బోల్డ్ బ్యూటీ‌ ఎవెలిన్ శర్మ మరోసారి సోషల్ మీడియాను హీటెక్కించింది. ఏ విషయమైన ఓపెన్‌గా మాట్లాడే నటి ఇటీవల మహిళల బ్రెస్ట్, పిల్లలకు పాలివ్వడం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్న సంగతి తెలిసిందే. కాగా తాజాగా బిడ్డకు పాలిస్తున్న ఫొటోను నెట్టింట్లో షేర్ చేసింది. అయితే ఈ పిక్‌పై కొంతమంది పాజిటీవ్ కామెంట్లు చేస్తుంటే మరికొందరూ నెగెటీవ్‌గా స్పందిస్తున్నారు. ఈ మేరకు కామెంట్లపై స్పందించిన నటి.. 'బిడ్డకు పాలిస్తున్న ఫొటోలను ఎందుకు పోస్ట్ చేస్తున్నానంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. కానీ, ప్రస్తుతం ఇదే నా ఉద్యోగం. దీనికోసం ఎన్నో అదనపు గంటలు పని చేస్తున్నా. ఎన్నో నిద్ర లేని రాత్రులు గడుపుతున్న. నా బిడ్డ ఆరోగ్యంగా ఎదగడమే నాకు లభించే జీతం. అదే ఒక తల్లిగా ఎవరైనా కోరుకునేది' అంటూ ఎమోషనల్‌ అయింది. ఈ క్రమంలోనే పాలివ్వడంలో మాతృత్వపు మాధుర్యాన్ని చూడండి కానీ, అశ్లీలాన్ని కాదని చెబుతూ.. ప్రతి ఒక్క పురుషుడు ఈ స్టేజ్ దాటుకుని ఈ రోజు పెద్దవారయ్యారనే సంగతి మరవొద్దంటూ నెటిజన్లకు కౌంటర్ వేసింది.

Advertisement

Next Story