- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వెంచర్‌లో ఇంజనీరింగ్ స్టూడెంట్ డెడ్ బాడీ కలకలం.. హత్యా.. ఆత్మహత్యా..?
దిశ, వికారాబాద్: అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతిచెందిన సంఘటన నవాబుపేట పోలీస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నాన్న పరీక్షలు ఉన్నాయి కాలేజీకి వెళ్తున్నాను అని నాన్నతో, నా స్నేహితులతో బయటికి వెళ్లి వస్తానని హాస్టల్‌మేట్‌కు ఫోన్ చేసి చెప్పి బయటకు వెళ్లిన యువకుడు అనుమానాస్పద స్థితిలో ఓ వెంచర్ పక్కన ప్రభుత్వ భూమిలో శవమై కనిపించాడు. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ మండలం కోటలాగూడ గ్రామానికి చెందిన మూడవత్ రాములు నాయక్ ఏకైక కుమారుడు శ్రీనివాస్ (22). ఇతడు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలంలోని జెబీఐటి కళాశాలలో మెకానికల్ ఇంజినీర్ మూడవ సంవత్సరం చదువుతున్నాడు. మహా శివరాత్రి పండుగ కోసం ఇంటికి వచ్చిన శ్రీనివాస్.. పరీక్షలు ఉన్నాయని చెప్పి ఈనెల 3వ తేదీన కళాశాలకు వెళ్లి పోయాడు.
4వ తేదీ సాయంత్రం తన హాస్టల్‌మేట్ సునీల్‌కు ఫోన్ చేసి తన స్నేహితులతో కలిసి బయటకు వెళ్తున్నన్నాడు. 5వ తేదీన తన తండ్రి రాములకు ఫోన్ చేసి మాట్లాడాడు. ఆ తర్వాత శ్రీనివాస్ ఫోన్ కలవకుండా పోయింది. కళాశాలలో ఉన్నాడని తల్లిదండ్రులు.. స్నేహితులతో ఉన్నాడని హాస్టల్‌మేట్స్ అనుకుంటున్న సమయంలో 8వ తేదీ మంగళవారం రోజున వికారాబాద్ జిల్లా నవాబుపేట్ మండలం, ఎల్లకొండ గేట్ ఎదురుగా ఓ వెంచర్ పక్కన బైక్‌పై అనుమానాస్పదస్థితిలో మృతి చెంది ఉన్నాడు. పశువుల కాపరులు గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు అక్కడకు చేరుకుని తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా.. తండ్రి రాములు నాయక్ తన కొడుకే అని గుర్తించాడు. తన కుమారుడి మృతిపై అనుమానాలు ఉన్నాయని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్ఐ భరత్ రెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.