వారి సమస్యలు పరిష్కరించాలి.. ప్రభుత్వాన్ని కోరిన జిల్లా అధ్యక్షుడు

by Javid Pasha |
వారి సమస్యలు పరిష్కరించాలి.. ప్రభుత్వాన్ని కోరిన జిల్లా అధ్యక్షుడు
X

దిశ ప్రతినిధి , హైదరాబాద్: ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ టైం స్కేల్ ఉర్దూ అకాడమీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని టీఎన్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ముజీబ్ హుసేనీ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు శుక్రవారం ఆయా విభాగాల ఉద్యోగులు దీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న తమ సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళడం ద్వారా పరిష్కరించేలా చూడాలని ఆయనకు వినతిపత్రం అందజేశారు . ఈ సందర్భంగా ముజీబ్ హుసేనీ మాట్లాడుతూ.. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ 17 మంది, ఉర్దూ అకాడమీలో సుమారు 150 మంది దాదాపు 20 సంవత్సరాలుగా టైం స్కేల్ జీతంపై పనిచేస్తున్నారని తెలిపారు. మరో మూడు సంవత్సరాలలో వీరు రిటైర్మెంట్ కానున్నారని చెప్పారు. అయితే వీరి సర్వీస్ అంతా ప్రభుత్వ విధులకే అంకితం చేసినందున మానవతా దృక్పథంతో వారిని రెగ్యులైజ్ చేయాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావును కోరారు.

Advertisement

Next Story