- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సోషల్ మీడియాలో ట్రెండవుతున్న ఇఫ్తార్ విందు.. అందులో స్థానం..
దిశ, డైనమిక్ బ్యూరో : ఈజిప్టులోని క్రైస్తవ మత పెద్దలు జాతీయ ఐక్యతను చాటుకునేందుకు గత ఐదు దశాబ్దాలుగా ముస్లింలకు ఇఫ్తార్ భోజనాలను ఏర్పాటు చేస్తున్నారు. రంజాన్ సందర్భంగా ఏర్పాటు చేసిన విందులో మతంతో సంబంధం లేకుండా బంధువులు,స్నేహితులు,ఇరుగుపొరుగువారు అంతా కలిసి పాల్గొంటారు. అయితే తాజాగా ఇలా ఏర్పాటు చేసి ఇఫ్తార్ విందు రికార్డును సాధించింది. ఈజిప్ట్‌లోని ఒక వీధిపొడవునా ఏర్పాటైనా ఇఫ్తార్ టేబుల్ గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకుంది. ఈ విందులో అక్కడి పరిసర ప్రజల అభిరుచులకు అనుగుణంగా అన్ని రకాల ఆహారపదార్ధాలు ఉన్నాయి. వీటిని ఒకరికొకరు పంచుకుంటూ పేద, ధనిక అన్న తేడా లేకుండా, అందరూ కలిసి ఇఫ్తార్ విందును ఆరగిస్తారు. అయితే ఈ విందుకు సంబంధించిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ట్రెండింగ్ అవుతూ అందరిని ఆకట్టుకుంటుంది. ఇది చూసిన నెటిజన్లు అద్భుతంగా ఉందంటూ కామెంట్లు చేస్తున్నారు.