- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ee Saraina: ‘ఈ’ సారైనా మూవీ ట్రైలర్ విడుదల.. థియేటర్లోకి వచ్చేదిప్పుడే?
దిశ, వెబ్‌డెస్క్: విప్లవ్(viplav) దర్శకత్వం వహిస్తూ ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ఈ సారైనా(Ee Saraina). షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా గ్రామీణ నేపథ్యంలో సాగనుందని తెలుస్తోంది. ఒక నిరుద్యోగ యువకుడు గవర్నమెంట్ జాబ్ కోసం ప్రయత్నిస్తూ.. అలాగే అతడి ప్రేమను గెలిపించుకోవడానికి ట్రై చేస్తుంటారు. మరీ ఈ రెండు సాధ్యమయ్యేనా? యువకుడి లక్ష్యాలు నేరవేరాయా? అనేది సినిమా మొత్తం చూస్తే అర్థమైపోతుంది. ఇప్పటికే ఈసారైనా చిత్రం నుంచి విడుదలైన సాంగ్స్(Songs), టీజర్ నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇకపోతే తాజాగా మేకర్స్ ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించి.. 'ఈ సారైనా' సినిమా ట్రైలర్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా హీరో విప్లవ్ మాట్లాడారు. ప్రేక్షకుల ముందుకు ఈసారైనా మూవీ రావడానికి కారణ మాత్రం సంకీర్త్ (Sankeerth) అన్న అని తెలిపాడు. అలాగే ఈ సినిమాకు నేను ప్రొడ్యూసర్ ను అని చెప్పాడు. అన్ని బాధ్యతలు ఒకేసారి తీసుకోవడం కష్టమే కానీ మేనేజ్ చేశానని వెల్లడించాడు. తర్వాత కథానాయిక అశ్వినీ(Ashwini) మాట్లాడుతూ.. ముందుగా విప్లవ్ కు ధన్యవాదాలు తెలిపింది. శిరీష(shirisha) పాత్ర ఇచ్చినందుకు థ్యాంక్ అని పేర్కొంది. తన తొలి చిత్రానికి ఇలాంటి పాత్ర చేయడం చాలా హ్యాపీగా ఉందని, షూటింగ్ మాత్రం వేసవి సెలవుల్లా అనిపించిందని అశ్విని చెప్పుకొచ్చింది.
తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ కార్తికేయ ( karthikeya ) మాట్లాడారు. సలార్ సినిమా అనంతరం తనకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఈసారైన సినిమాలోదేనని అన్నాడు. పాత్ర ఇదని చెప్పగానే చాలా బాగా నచ్చిందని తెలిపాడు. ఇవాళ ప్రివ్యూలో చూశాక మూవీలో అన్ని సన్నివేశాలు ప్లెంజంట్ గా అనింపించాయని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అలాగే‘నా దృష్టిలో చిన్న, పెద్ద చిత్రాలంటూ ఏముండవని కో ప్రోడ్యూసర్ సంకీర్త్ చెప్పుకొచ్చాడు.
సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుందని అన్నారు. ఫీల్ గుడ్ ఎక్స్పీరియన్స్ పొందుతారని సంకీర్త్ ఈవెంట్ లో భాగంగా మాట్లాడారు. ఇక ఈసారైనా మూవీలో అశ్విని, మహబూబ్ బాషా (Mahbub Basha), కార్తికేయ దేవ్(Karthikeya Dev), ప్రదీప్ రాపర్తి(Pradeep Raparthi), నీతు క్వీన్(Neetu queen), సత్తన్న(Sattanna) తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ మూవీ నవంబరు 8 వ తేదీన విడుదల కానుంది.
Read more ...