Varsha Raut: సంజయ్ రౌత్ భార్య వర్షా రౌత్‌కు ఈడీ షాక్.. సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపించేలా..?

by Nagaya |   ( Updated:2022-08-04 11:54:26.0  )
ED Summons Sanjay Rauts wife Varsha Raut in Money Laundering Case
X

దిశ, వెబ్‌డెస్క్ : ED Summons Sanjay Raut's wife Varsha Raut in Money Laundering Case| మహారాష్ట్ర రాజకీయాలు సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తున్నాయి. రాజకీయ తిరుగుబాటుతో సీఎం పదవిని కోల్పోయిన ఉద్దవ్ వర్గం వర్సెస్ సీఎం ఏక్ నాథ్ షిండే వర్గం మధ్య ఎత్తుకు పైఎత్తు అన్నట్లుగా పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. భూ కుంభకోణంలో మనీలాండరింగ్ ఆరోపణలపై ఉద్దవ్ వర్గంలో కీలకంగా ఉన్న శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ కస్టడిలోకి తీసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన భార్య వర్షా రౌత్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు ​జారీ చేసింది. ముంబైలోని ప్రత్యేక కోర్టు సంజయ్ రౌత్ ఈడీ కస్టడీని ఆగస్టు 8 వరకు పొడిగించిన కొద్ది గంటలకే అతడి భార్యకు ఈడీ సమన్లు జారీ చేయడం హాట్ టాపిక్ అయింది.

ఈ కేసులో వర్షా రౌత్ ఆస్తులను ఇప్పటికే ఈడీ జప్తు చేసినప్పటికీ ఆమెను ఇప్పటి వరకు ప్రశ్నించలేదు. నాలుగు నెలల క్రితం వర్షా రౌత్, సంజయ్ రౌత్‌ల ఇద్దరు సహచరులకు చెందిన రూ.11 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. దాదర్‌లో వర్షా రౌత్ ఆధీనంలో ఉన్న ప్లాట్, అలీబాగ్‌లోని కిహిమ్ బీచ్‌లో ఆ దంపతుల సన్నిహిత సహచరుడైన సుజిత్ పాట్కర్ భార్య స్వప్న పాట్కర్ సంయుక్తంగా కలిగి ఉన్న ఎనిమిది ప్లాట్లు జప్తు చేసిన వాటిలో ఉన్నాయి.

ఇది కూడా చదవండి: నమస్తే గ్యాంగ్ కేసులో ఇద్దరు అరెస్ట్

Advertisement

Next Story

Most Viewed