- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- OTT Release
ఎడ్ సెట్ షెడ్యూల్ విడుదల.. అప్పటి నుంచే దరఖాస్తుల స్వీకరణ
దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్ ఎడ్‌సెట్-2022 నోటిఫికేషన్ విడుదలైంది. 2022-23 విద్యా సంవత్సరానికి గాను రెండేళ్ల బీఈడీ కోర్సుకు సంబంధించిన నోటిఫికేషన్‌ను ఉన్నత విద్యామండలి చైర్మన్లింబాద్రి, ఎడ్సెట్కన్వీనర్రామకృష్ణ, కో కన్వీనర్ శంకర్ సోమవారం విడుదల చేశారు. ఈనెల 7వ తేదీ నుంచి దరఖాస్తులు ప్రారంభంకానున్నాయి. జూన్15 వరకు ఆన్లైన్లో దరఖాస్తులను స్వీకరించనున్నారు. రూ.250 ఆలస్య రుసుముతో జూలై 1 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో జూలై 15వ తేదీ వరకు దరఖాస్తులకు అవకాశం కల్పించారు.
రిజిస్ట్రేషన్ఫీజు రూ.650 జనరల్అభ్యర్థులకు, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.450 ఫీజుగా అధికారులు నిర్ణయించారు. జూలై 26, 27 తేదీల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. 19 రీజినల్సెంటర్లలో 55 కేంద్రాల్లో పరీక్షను నిర్వహించనున్నట్లు వారు వెల్లడించారు. ఇందులో 17 రీజినల్సెంటర్లు తెలంగాణలో ఉండగా, రెండు సెంటర్లు ఏపీలోని కర్నూల్, విజయవాడ కేంద్రంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఇతర వివరాలకు https://edcet.tsche.ac.in లేదా http://www.tsche.ac.in వెబ్‌సైట్‌ను సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణ వ్యాప్తంగా 220 బీఎడ్ కళాశాలల్లో 19,600 సీట్లు ఉన్నాయి. కాగా గతేడాది నిర్వహించిన ఎడ్‌సెట్‌లో 33,683 మంది విద్యార్థులు అర్హత సాధించారు.