- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చైనా బ్రాండ్ వీవో కార్యాలయాల్లో ఈడీ తనిఖీలు!
న్యూఢిల్లీ: ప్రముఖ మొబైల్ బ్రాండ్, చైనాకు చెందిన వీవో సంస్థ భారత కార్యాలయాల్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) మంగళవారం తనిఖీలు నిర్వహించింది. దేశవ్యాప్తంగా కంపెనీకి చెందిన పలు రాష్ట్రాల్లోని 44 ప్రదేశాల్లో వివోతో పాటు దాని అనుబంధ కార్యాలయల్లో ఈడీ సోదాలు జరిపింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం ఉల్లంఘించిందనే ఆరోపణల నేపథ్యంలోనే ఈ దాడులు జరిపినట్టు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
వీవోకు చెందిన పంపిణీదారు కంపెనీలో చైనా వాటాదారులు నకిలీ పత్రాలను, తప్పు భారత చిరునామాలను సమర్పించినట్టు ప్రభుత్వం గుర్తించినట్టు సమాచారం. ఈ వ్యవహారానికి సంబంధించె ఈడీ దర్యాప్తు జరుపుతున్నట్టు తెలుస్తోంది. అయితే, దీనిపై వీవో కంపెనీ అధికారికంగా స్పందించాల్సి ఉంది. కాగా, ఇప్పటికే ప్రభుత్వం చైనాకు చెందిన ఇతర దిగ్గజ బ్రాండ్ కంపెనీలపై దృష్టి సారించింది. ప్రస్తుత దేశీయంగా మెరుగైన విక్రయాలను నమోదు చేస్తున్న షావోమీ కంపెనీకి చెందిన అకౌంట్లను ఈడీ సీజ్ చేసింది. రూ. 5,500 కోట్లకు పైగా విలువైన షావోమీ ఇండియా బ్యాంక్ ఆస్తులను సీజ్ చేయాలని గతంలో ఈడీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈడీ ఆర్డర్‌ను సవాలు చేస్తూ షావోమీ కంపెనీ రిట్ పిటిషన్‌ను దాఖలు చేసింది. ఈ వ్యవహారం ఇంకా కోర్టులో నడుస్తోంది.