Dulquer Salmaan: డబ్బుకు మాత్రమే వాల్యూ ఇచ్చే మనిషిగా దుల్కర్.. అంచనాలను రెట్టింపు చేస్తున్న ట్రైలర్

by sudharani |
Dulquer Salmaan: డబ్బుకు మాత్రమే వాల్యూ ఇచ్చే మనిషిగా దుల్కర్.. అంచనాలను రెట్టింపు చేస్తున్న ట్రైలర్
X

దిశ, సినిమా: మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) తాజా చిత్రం ‘లక్కీ భాస్కర్’ (Lucky Bhaskar). బ్లాక్ బస్టర్ దర్శకుడు వెంకీ అట్లూరి (Venky Atluri) తెరకెక్కిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ఫోర్ సినిమాస్‌ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇందులో నుంచి ఇప్పటికే రిలీజైన ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలు (Huge expectations) క్రియేట్ చెయ్యగా.. తాజాగా 'లక్కీ భాస్కర్' నుంచి ట్రైలర్ (trailer) రిలీజ్ చేశారు చిత్ర బృందం.

ఆద్యంతం ఆసక్తికరంగా సాగిన ఈ ట్రైలర్ (trailer)లో.. ‘డబ్బు కోసం ఎంతటి రిస్క్ అయినా చేసే భాస్కర్ పాత్రలో దుల్కర్ సల్మాన్ కనిపించాడు. అతను మంచివాడు లేదా చెడ్డవాడిగా ఉండాలనుకోవడంలేదు. తాను తలచుకుంటే ఏదైనా చేయగలిగే అంత ధనవంతుడు కావాలని అనుకుంటాడు. బాగా డబ్బు సంపాదిస్తే, శ్వాస కూడా గౌరవించబడుతుంది అనేది అతని సిద్ధాంతం (theory)’.

ఈ ట్రైలర్ ఈవెంట్‌లో దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. ‘14 నెలల తర్వాత నా నుంచి వస్తున్న సినిమా ‘లక్కీ భాస్కర్’. ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని భావిస్తున్నాను. ఇది నాకు చాలా ప్రత్యేకమైన మూవీ. హాస్యం (comedy) ఉంటుంది, భావోద్వేగాలు (emotions) ఉంటాయి, కుటుంబ ప్రేక్షకులు మెచ్చే అంశాలు ఉంటాయి. సాంగ్స్ (Songs) కూడా చాలా బాగా వచ్చాయి. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను’ అని చెప్పుకొచ్చాడు. కాగా.. ‘లక్కీ భాస్కర్’ తెలుగుతో పాటు మలయాళం, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో అక్టోబర్ 31న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Advertisement

Next Story