నాడు రూ.70.. నేడు రూ.30! పానకాలరాయుని పానకం ధరలో భారీ మార్పులు

by Shiva |
నాడు రూ.70.. నేడు రూ.30! పానకాలరాయుని పానకం ధరలో భారీ మార్పులు
X

దిశ, మంగళగిరి: ‘మన మంగళగిరి.. మన లోకేశ్’ ట్యాగ్‌ను మంత్రి నారా లోకేశ్ సార్ధకం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. దక్షిణ భారత దేశంలోనే పేరుగాంచిన మంగళగిరి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్దానం ఎగువ సన్నిధిలో టెండర్ ముసుగులో నాసిరకం పానకం, భక్తుల నిలువు దోపిడీకి ఆయన ముగింపు పలికారు. సోమవారం నుంచి పానకం తయారీకి మంగళగిరి ఆక్షయపాత్ర ప్రతినిధి రఘునందనదాస పూజలు నిర్వహించి ప్రారంభించారు.

తయారీ బాధ్యతలు ఇస్కాన్ కు..

ఇక నుంచి నాణ్యమైన బిందె బెల్లం పానకం రూ.30, పట్టిక బెల్లం పానకం రూ.35కు అందుబాటులోకి తీసుకువచ్చారు. గతంలో టెండర్ ముసుగులో నాణ్యత లేని నాసిరకం పానకానికి రూ.70 వసూలు చేసేవారు. భక్తుల దోపిడీని గుర్తించిన లోకేశ్.. ప్రత్యేక శ్రద్ద పెట్టి, భక్తులకు అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టారు. ఆధ్యాత్మిక భావన, సేవా ధృక్పథంతో వ్యవహరించే ఇస్కాన్‌కు పానకం బాధ్యతలు అప్పగించడంపై భక్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed