Dulquer Salmaan: అదే కనుక జరిగితే నాగవంశీ ఫొటో ఫ్రేమ్ చేయించి ఇంట్లో పెట్టుకుంటా: దుల్కర్ సల్మాన్

by Anjali |   ( Updated:2024-10-29 07:03:40.0  )
Dulquer Salmaan: అదే కనుక జరిగితే నాగవంశీ ఫొటో ఫ్రేమ్ చేయించి ఇంట్లో పెట్టుకుంటా: దుల్కర్ సల్మాన్
X

దిశ, వెబ్‌డెస్క్: మాలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. భాషతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తూ వరుస హిట్స్ కొడుతున్నాడు. కలెక్షన్ల విషయంలో కూడా దూసుకుపోతున్నాడు కానీ రూ. 100 కోట్లు ఇప్పటి వరకు టచ్ చేయలేదని చెప్పవచ్చు. సీతారామం మూవీకి రూ. 96 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. 100 కోట్ల రూపాయలు మిస్ అయిపోయాయి. తాజాగా దుల్కర్ రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్ల గురించి చెప్పుకొచ్చాడు. ‘నా సినీ కెరీర్ 13 ఏళ్లు అని.. ఆల్మోస్ట్ 40 మూవీస్ చేశానని అన్నాడు. వంద కోట్ల కలెక్షన్లు సాధించడం అనేది నా డ్రీమ్ అని తెలిపారు. నిజంగా ‘లక్కీ భాస్కర్’ చిత్రం ఫస్ట్ డే న రూ. 100 కోట్లు వసూలు చేస్తే నాగవంశీ ఫొటో ఫ్రేమ్ చేయించి మా ఇంట్లో పెట్టుకుంటానని వెల్లడించారు. వంద కోట్లు కొల్లగొడితే అంతకన్నా అదృష్టం ఇంకేం ఉంటుందని పేర్కొన్నాడు. లక్కీ భాస్కర్ చిత్రం ఫస్ట్ రోజు రూ. 100 కోట్లు సాధిస్తుందా మరీ.. ఓవరాల్‌గా అయినా రూ. 100 కోట్లు దాటి దుల్కర్ సల్మాన్ కెరీర్‌లో ఫస్ట్ 100 కోట్ల సినిమా అవుతుందా? లేదో? చూడాలి మరీ. ప్రస్తుతం సోషల్ మీడియాలో దుల్కర్ సల్మాన్ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story