సార్ నా భార్య రానంటోంది... నేను దూకి సచ్చిపోతా

by S Gopi |
సార్ నా భార్య రానంటోంది... నేను దూకి సచ్చిపోతా
X

దిశ, వెబ్ డెస్క్: తన భార్య కాపురానికి రావట్లేదంటూ ఓ వ్యక్తి మొబైల్ టవర్ ఎక్కి హంగామా చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. వివరాల్లోకి వెళితే.. మహారాష్ట్రలోని జల్నా జిల్లాకు చెందిన ఓ వ్యక్తి 100 మీటర్ల ఎత్తున మొబైల్ టవర్ ఎక్కి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాడు. తన భార్యను ఎంత బ్రతిమిలాడినా కాపురానికి రావట్లేదని టవర్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు యత్నించాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు చేరవేశారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు అక్కడికి చేరుకుని అతనికి సర్ధిచెప్పి టవర్ దిగేలా చేశారు. ఆ సమయంలో అతను మందు తాగి ఉన్నట్లు గుర్తించారు. కొద్దిసేపటి తర్వాత అతడిని పోలీసులు విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story

Most Viewed