- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ద్రౌపది నా అసలు పేరు కాదు..
న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన ద్రౌపది ముర్ము గురించి ఓ వాస్తవం వెలుగులోకి వచ్చింది. తన అసలు పేరు ద్రౌపది కాదని, మహాభారతంలోని పాత్రను ఆధారంగా చేసుకుని తన స్కూల్ టీచర్ పెట్టారని వెల్లడించారు. గతంలో ఒడియా వీడియో మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. తన సంతాలీ పేరు 'పుతి' అని పేర్కొన్నారు. స్కూల్ టీచర్ ద్రౌపదిగా మార్చారని చెప్పుకొచ్చారు. 1960లో గిరిజనులు అధికంగా ఉండే మయూర్‌బంజ్ జిల్లాలోని ఉపాధ్యాయులు 1960లలో బాలాసోర్ లేదా కటక్ నుండి ప్రయాణించేవారని పేర్కొన్నారు. సంతాలీ సంస్కృతిలో పేర్లకు చావు ఉండదని తెలిపారు. ఒకవేళ కూతురు జన్మిస్తే వారి నానమ్మ పేరు, కొడుకు జన్మిస్తే తాత పేరు పెట్టడం అనవాయితీగా ఉందని ఇంటర్వ్యూలో వెల్లడించారు. పాఠశాలలు, కళాశాలలలో తుడు అనే ఇంటిపేరును కలిగి ఉన్న ద్రౌపది ముర్ము, బ్యాంక్ అధికారి అయిన శ్యామ్ చరణ్ ముర్ముని వివాహం చేసుకున్న తర్వాత ముర్ము అనే పేరు చివర ఉపయోగించడం ప్రారంభించారు.