- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అక్కినేని ఫ్యామిలీలో పేర్లకు ముందు నాగ అని ఎందుకు ఉంటుందో తెలుసా..? అఖిల్‌కు లేకపోవడానికి కారణం అదే..!
దిశ, సినిమా: సినీ ఇండస్ట్రీలో తమకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న అక్కినేని ఫ్యామిలీ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించి నట సామ్రాట్‌గా పేరు తెచ్చుకున్న అక్కినేని నాగేశ్వరావు.. తన నటనతో కోట్లాది మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక ఆయన వారసుడిగా నాగార్జున సైతం ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. ‘విక్రమ్’ మూవీతో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన నాగార్జున.. ఈ మూవీతో సక్సెస్ కాలేకపోయాడు. కానీ తర్వాత పలు హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు పొందారు. ఇక ‘శివ’ మూవీతో నాగార్జున కెరీర్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత ఆయన వెనక్కి తిరిగి చూసుకోలేదు. ఈ క్రమంలోనే ఆయన స్టార్ స్టేటస్‌ను పొందారు.
ఇక నాగార్జున తర్వాత ఇండస్ట్రీలో ఆయన వారసులుగా నాగచైతన్య, అఖిల్ ప్రస్తుతం రాణిస్తున్నారు. అయితే ఈ ఇద్దరికీ మొదట్లో ఆశించిన స్థాయిలో గుర్తింపు రాలేదు. కానీ నెమ్మదిగా నిలదొక్కుకుంటున్నారు. ఇక అక్కినేని ఫ్యామిలీకి సంబంధించి అభిమానులకు ఎప్పటి నుంచో ఓ సందేహం బలంగా ఉంది. అదేమిటంటే.. అక్కినేని ఫ్యామిలీలో దాదాపుగా అందరి పేర్లకు ముందు నాగ అని వస్తుంది. దీంతో ఈ విషయం చాలా మంది అభిమానుల మెదళ్లను తొలుస్తోంది. అయితే దీనిపై గతంలోనే నాగార్జున ఓసారి క్లారిటీ ఇచ్చారు. తమ ఫ్యామిలీలో అందరి పేర్లకు ముందు నాగ అని ఎందుకు వస్తుందో చెప్పారు. దీనికి ఒక బలమైన కారణమే ఉందట. అదేమిటంటే..
నాగేశ్వర్ రావు కడుపులో ఉన్నప్పుడు ఆయన తల్లికి కలలో పాములు కనిపించేవట. దీంతో ఆమె భయపడి తన కొడుక్కి నాగేశ్వరావు అని పేరు పెట్టారు. అయినప్పటికీ ఆమెకు తరచూ పాములు కనిపిస్తూ ఉండేవట. దీంతో ఆమె నాగదేవతకు ప్రత్యేకంగా తరచూ పూజలు చేస్తుండేదట. అంతేకాదు.. తమ కుటుంబంలో పుట్టే పిల్లలకు నాగ అని పేరు వచ్చేలా పెట్టాలని చెప్పిందట. దీంతో నాగేశ్వరావు తన కుమారుడు నాగార్జునకు అలా పేరు పెట్టారు. తర్వాత నాగార్జున కూడా నాగ అని వచ్చేలా నాగచైతన్య పేరు పెట్టారు. ఈ విషయాన్ని నాగార్జున స్వయంగా తెలియజేశారు. అయితే అఖిల్ విషయంలో మాత్రం అలా చేయలేదు. ఎందుకంటే మొదటి సంతానానికి మాత్రమే అలా పెట్టాలని చెప్పారట. కనుకనే వారికి నాగ అని పేరులో మొదట వస్తుంది. ఇదీ.. ఈ విషయం వెనుక ఉన్న అసలు రహస్యం. ప్రస్తుతం ఈ న్యూస్ నెట్టింట వైరల్ అవుతోంది.