Goat Brain: బేజా ఫ్రై తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

by Anjali |
Goat Brain: బేజా ఫ్రై తింటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: బేజా ఫ్రై అంటే అందరికీ తెలిసిందే. మేక లేదా గొర్రె మెదడును వేయించుకుని తినేదాన్ని బేజా ఫ్రై అంటారు. బేజా ఫ్రై చాలా టేస్టీగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. రుచికరమైన వంటకాల్లో ఇది ఒకటి. అయితే చాలా మంది మేక మెదడు టేస్టీగా ఉంటుందని తింటారు కానీ దీంతో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

ఈ వ్యాధిగ్రస్తులకు బెస్ట్ ఫుడ్..

మేక మెదడులో కార్బోహైడ్రేట్లు తక్కువగా ఉంటాయి. కాగా మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచి ఫుడ్ అని చెప్పుకోవచ్చు. అలాగే మేక మెదడులో ప్రోటీన్, ఐరన్ అధికంగా ఉంటుంది. పోషకాలు దట్టంగా ఉంటాయి. బేజా ఫ్రై స్మెల్ లోహ రుచిని కలిగి ఉంటుంది. ఒకవేళ మీకు ఆ రుచి నచ్చకపోతే సుగంధ ద్రవ్యాలు మసాలాలు బాగా వేసి ఫ్రై చేసుకుని తినొచ్చు.

మేక మెదడుకు అత్యంత ఖరీదు..

బేజా ఫ్రైలో ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉండటమే కాకుండా యాంటీ యాక్సిడెంట్లు దట్టంగా ఉంటాయి. కాగా అప్పుడప్పుడు తింటూ ఉంటే ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఫ్రాన్స్ లో దీన్ని బాగా తింటుంటారట. గొర్రె, మేక మెదడుకు ఖరీదు కూడా బాగానే ఉంటుంది. ఫ్రాన్స్ ప్రజలు బటర్ లో డీప్ ఫ్రై చేసి ఎంతో ఇష్టంగా తింటారు.

100 గ్రాముల గొర్రె మెదడుతో అనేక లాభాలు..

మేక మెదడు కేవలం వంద గ్రాములు ఉంటుంది. దీన్ని దక్షిణ భారతదేశంలో కూడా ఎక్కువగా తింటుంటారు. ముంబయిలో కూడా కొన్ని ప్రాంతాల వారు మసాలా కూరలా వండుకుని తింటారు. అయితే వంట చేయడానికి ముందు మేక, గొర్రె మెదడును క్లీన్ గా కడగండి. తర్వాత వండాలి. మేక మెదడులో ఎలాంటి విషాలు ఉండవు కనుక ఎలాంటి సందేహం లేకుండా తినవచ్చు.

వీరు బేజా ఫ్రైకి దూరంగా ఉండాలి..

బేజా ఫ్రై మరీ ఎక్కువగా కూడా తీసుకోకూడదు. ఎందుకంటే దీనిలో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. అలాగే ఎక్కువగా సంతృప్త కొవ్వు పదార్థం కలిగి ఉంటుంది. కాగా లిమిట్ లో తింటే మంచిది. బీపీ, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్ తో బాధపడేవారు బేజా ఫ్రై కు దూరంగా ఉండటం మేలు.

గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.

Advertisement

Next Story