- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
దీపావళి పండుగకు డ్రై ఫ్రూట్స్ బహుమతిగా ఇస్తున్నారా.. తస్మత్ జాగ్రత్త..!!
దిశ, వెబ్‌డెస్క్: దీపావళి తెలుగు వారు ఎంత ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అక్కర్లేదు. అయితే దీపావళికి చాలా మంది ఆరోగ్యం గురించి ఆలోచించి.. స్వీట్స్‌కు బదులు డ్రై ఫ్రూట్స్ బహుమతిగా ఇస్తున్నారు. అయితే వీటిలో కల్తీ జరుగుతుందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కల్తీవి ఏంటో నిపుణులు చెబుతున్నారు. వాటిని ఎలా గుర్తించాలో ఇప్పుడు చూద్దాం..
ఈ సమస్యలు తలెత్తుతాయి..
ఇక డ్రై ఫ్రూట్స్ అనగానే చాలా మందికి పిస్తా, బాదం, ఎండుద్రాక్ష, జీడిపప్పు, అంజీర్ పండ్లు గుర్తుకు వస్తాయి. అయితే ఈ డ్రై ఫ్రూట్స్ కల్తీ అవ్వడం వల్ల క్యాన్సర్ వంటి ప్రమాదకర సమస్యలు తలెత్తుతాయని నిపుణులు అంటున్నారు. కేవలం క్యాన్సర్ మాత్రమే కాదు.. కడుపు సంబంధిత వ్యాధులు, శ్వాసకోశ సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
నకిలీ డ్రైఫ్రూట్స్‌ను ఇలా గుర్తించండి..
అయితే నకిలీ డ్రైఫ్రూట్స్ ను ఇలా గుర్తించండి. మార్కెట్ లో దొరికే జీడిపప్పు, బాదంలకు ప్రమాదకర రసాయనాలు, కలర్స్ ను వీటిపైన పూసి అమ్ముతున్నారట. తాజాగా మెరవడం కోసం ఇలా చేస్తున్నారట. కాగా ఈ ఆర్టిఫీషియల్ రంగులు ఎన్నో సమస్యల్ని తెచ్చిపెడుతాయి. స్కిన్ అలర్జీ, దగ్గు, దద్దుర్లు వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా ఈ కెమికల్స్ జీర్ణ సమస్యల్ని కూడా తెచ్చిపెడతాయి. విరేచనాలు,వాంతులు, ఫుడ్ పాయిజనింగ్ అవుతాయి.కల్తీ జీడిపప్పు కల్తీ అయితే వాసన జిడ్డుగా వస్తుంది. కాగా మార్కెట్ లో నకిలీ డ్రైఫ్రూట్స్ ను గుర్తించి కొనాలంటున్నారు నిపుణులు.
డ్రై ఫ్రూట్స్ ఉపయోగాలు..
వివిధ రకాల డ్రై ఫ్రూట్స్ తీసుకోవడం వల్ల మీ శరీరానికి విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్లు మొదలైన వివిధ పోషకాలు అందుతాయి. అంతేకాకుండా, డ్రై ఫ్రూట్స్ యొక్క ఆరోగ్య ప్రయోజనాలు క్యాన్సర్ నివారణ, టైప్ 2 డయాబెటిస్ నియంత్రణ, బరువు తగ్గడం, బరువు పెరగడం, ఎముకలను బలోపేతం చేయడం మరియు మరెన్నో ఉన్నాయి.
గమనిక: పై వార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు.కేవలం మీ అవగాహన కోసం మాత్రమే అందిస్తున్నాం. అనుమానాలు ఉంటే నిపుణులను సంప్రదించగలరు.