- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మూత్ర విసర్జన చేశాక వెంటనే వాటర్ తాగుతున్నారా..?
దిశ, వెబ్‌డెస్క్: హెల్తీగా ఉండాలంటే రోజులో సరైన మొత్తంలో వాటర్ తాజాగా తరచూ వైద్య నిపుణులు చెబుతూనే ఉంటారు. వాటర్ శరీరంలోని మలినాల్ని బయటకు పంపించడంలో ఎంతో మేలు చేస్తాయి. అలాగే బాడీని హైడ్రేట్‌గా ఉంచుతాయి. అయితే వాటర్ తాగే విషయంలో కొన్ని నియమాలుంటాయి. నిలబడి తాగకూడదని, తిన్న వెంటనే తాగకూడదని అనుంటారు. అలాగే ఆయాసపడుతున్నప్పుడు, రన్నింగ్ చేసిన వెంటనే తాగకూడదు అని నిపుణులు చెబుతుంటారు. తాజాగా టాయిలెట్ వెళ్లాక వాటర్ తాగొచ్చా..? లేదా? అనే దానిపై క్లారిటీ ఇచ్చారు నిపుణులు.
కామన్‌గా మూత్ర విసర్జన చేశాక దాహం వేస్తుంటుంది. కాగా చాలా మంది వచ్చీరాగానే వాటర్ తాగుతారు. ముఖ్యంగా ఆఫీసుల్లో వర్క్ చేసే ఉద్యోగులు బ్రేక్ టైంలో వాష్ర రూమ్ వెళ్లి.. వెంటనే నీరు తాగుతుంటారు. ఇది చాలా మందికి అలవాటు. మరీ ఇలా వాటర్ తాగడం మంచిదేనా? అని జనాలకు సందేహం వచ్చే ఉంటుంది. అయితే మూత్రం వెళ్లాక వెంటనే వాటర్ తాగడం అస్సలు ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
ఆయుర్వేదం ప్రకారం.. మూత్రం వెళ్లాక నీరు తాగడం అనేది మంచిది కాదని వెల్లడించారు. అయితే మూత్రం వెళ్లడం అనేది మూత్రపిండాలు అండ్ మూత్రాశయానికి సంబంధించిన ప్రక్రియ. కాగా టాయిలెట్ వెళ్లాక వెంటనే వాటర్ తీసుకుంటే మూత్రాశయంపై ఎక్కువ ఒత్తిడి పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాకుండా మూత్రపిండాల సాధారణ పనితీరుపై ప్రతికూల ప్రభావం కనిపిస్తుందని తెలిపారు. అలాగే లంగ్స్‌కు సంబంధించిన వ్యాధులు, అంటువ్యాధులు లాంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని చెబుతున్నారు.
మూత్ర విసర్జన చేసినాక శరీరంలో ద్రవాల స్థాయి కొంత తగ్గుముఖం పడుతుంది. ఉబ్బడం, పొత్తికడుపులో నొప్పి, అసౌకర్యంగ అనిపించడం, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్ పై ఎఫెక్ట్ చూపించడం లాంటి సమస్యలు ఏర్పడతాయి. అలాగే ఇన్ఫ్లామేషన్, హైపోనట్రేమియా, పొత్తి కడుపు విస్తరణ ప్రాబ్లమ్స్ వస్తాయి.
మూత్ర విసర్జన చేశాక ఎంత విరామం తర్వాత వాటర్ తాగాలో కూడా నిపుణులు వెల్లడించారు. టాయిలెట్ తర్వాత ఎప్పుడైనా సరై 20 నిమిషాల తర్వాత వాటర్ తాగాలని వెల్లడించారు. ఈ గ్యాప్ లో నీరు తాగితే శరీరానికి కూడా రిలీఫ్ ఉంటుంది.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన కోసం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.