- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భూ వివాదాల్లోకి పోలీసులను లాగొద్దు: ఏసిపి ఎడ్ల మహేష్
దిశ, బెల్లంపల్లి : భూ వివాదాల్లోకి పోలీసులను లాగొద్దని బెల్లంపల్లి ఏసీపి ఎడ్ల మహేష్ అన్నారు. బెల్లంపల్లి రూరల్ సర్కిల్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. భూ తగాదాలను పోలీసులకు ఆపాదించడం సరికాదన్నారు. పోలీస్ శాఖ, పోలీసు అధికారులపై అసత్య ప్రచారాలు చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. భూ వివాదంలో బెల్లంపల్లి రూరల్ సీఐ జగదీష్ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని రాజకుమార్ చేసిన ఆరోపణలపై అసలు విషయాలు వెల్లడించారు. బెల్లంపల్లి సబ్ డివిజన్ నెన్నెల మండలం నందులపల్లి గ్రామంలోని సర్వే నెంబర్ 169/2లో 2 ఎకరాల 37 గుంటల పట్టా భూమి కి సంబంధించి గత కొంతకాలంగా నికాడి బానయ్య, రాజ్ కుమార్ ల మధ్య భూ వివాదం నడుస్తుందని, వారికి సంబంధించిన భూ పత్రాలను 1982 నుంచి వెరిఫై చేసి ఫిర్యాదులపై కేసులు నమోదు చేశామన్నారు.
ఏదైనా భూ సమస్య ఉంటే కోర్టులో ఫిర్యాదు చేసుకోవాలని కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు సంబంధిత భూమి కి సంబంధించిన పత్రాల ఆధారంగా భూమి యజమానులకు అప్పగించటం జరుగుతుందని వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీసు శాఖ తరపున వారికి భద్రత కల్పించడం జరుగుతుందన్నారు. భూమి కి సంబంధించిన సమస్య కోర్టులోనే తేల్చుకోవాలని సివిల్ పంచాయతీల విషయంలో పోలీసులు కలుగజేసుకోవటం జరగదని, ఏ స్థాయి పోలీస్ అధికారి కూడా భూమి ఫలానా వ్యక్తికి సొంతమని అతడే యజమాని అని చెప్పే అధికారం లేదని తెలిపారు.