టీఆర్ఎస్ ప్రభుత్వానికి సిగ్గు మాలిన పని : డీకే అరుణ

by Nagaya |
టీఆర్ఎస్ ప్రభుత్వానికి సిగ్గు మాలిన పని : డీకే అరుణ
X

దిశ, తెలంగాణ బ్యూరో : బీజేపీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలను బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెండ్ చేయడం సిగ్గు మాలిన పని అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మండిపడ్డారు. సోమవారం హైదరాబాద్‌లో పత్రిక ప్రకటన విడుదల చేసిన ఆమె.. సోమవారం బడ్జెట్ సమావేశాలు ప్రారంభంలోనే ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలను మొత్తం బడ్జెట్ సమావేశాల నుంచి సస్పెండ్ చేయడమంటే, తెలంగాణ ప్రభుత్వం బీజేపీ అంటే ఎంతగా భయపడుతుందో అర్థం అవుతుందని పేర్కొన్నారు. ప్రశ్నించే వారంటే కేసీఆర్ కు గిట్టదని, కేసీఆర్ రాజ్యాంగం మార్చి తన ఇష్టా రాజ్యాంగం రాసుకోవడానికి ఇట్టువంటి దుశ్చర్యలకు పాలు పడుతున్నాడని డీకే అరుణ ధ్వజ మెత్తారు. బడ్జెట్ సమావేశాలకు ముందు గవర్నర్ ప్రసంగం లేకుండానే సమావేశాలు ప్రారంభించడమే కాకుండా, వాళ్ల తోక పార్టీల తోత్తులతో గవర్నర్ ప్రసంగం అవసరం లేదని చెప్పించడం దురదృష్టకరమని డీకే అరుణ దుయ్యబట్టారు.

బడ్జెట్ అనంతరం బీజేపీ ఎమ్మెల్యేలు వేసే ప్రశ్నలకు సమాధానాలు లేకపోవడంతోనే, ముందస్తుగా బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేసారని డీకే అరుణ ఆగ్రహం వ్యక్తం చేశారు. నిజంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల కోసం మంచి చేస్తే, బీజేపీ ఎమ్మెల్యేలు వేసే ప్రశ్నలకు సమాధానం చెప్పేందుకు భయం ఎందుకని ఆమె ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వంపై తెలంగాణ ప్రభుత్వం బురద చల్లి, ప్రజలకు అబద్ధాలు చెప్తే, వాటిని బీజేపీ ఎమ్మెల్యేలు నిలదీస్తారని, ఇటువంటి రాజ్యాంగ వ్యతిరేక కార్యకలాపాలకు కేసీఆర్ ప్రభుత్వం పాల్పడుతున్నారని డీకే అరుణ ఆరోపించారు.

Advertisement

Next Story

Most Viewed