- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఏపీలో ఎందుకు పెట్టలేదు? షర్మిల పార్టీపై డీకే అరుణ కీలక వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో వైఎస్ షర్మిల పార్టీ పెట్టడంపై బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. వైస్ షర్మిల తన కుటుంబంలో వచ్చిన విబేధాల వల్లే తెలంగాణలో పార్టీ పెట్టుకుందని అన్నారు. శనివారం విజయవాడలోని రాష్ట్ర బీజేపీ కార్యాలయంలో హర్ ఘర్ తిరంగ కార్యక్రమంపై జరిగిన రాష్ట్రస్థాయి సదస్సుకు హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా డీకే అరుణ సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో వైఎస్ కుటుంబం తెలంగాణ కోసం పోరాటం చేయలేదని, సెంటిమెంట్ ఉన్నంత వరకు తెలంగాణలో ఆంధ్రవాళ్లు పెట్టే పార్టీలకు ఆదరణ ఉండబోదని స్పష్టం చేశారు. షర్మిల ఆంధ్రాలోనే పార్టీ పెట్టవచ్చు కదా.. తెలంగాణలో ఎందుకు పార్టీ పెట్టిందని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో షర్మిల ఆంధ్రాలో YSRCP తరపున ప్రచారం చేసిన సంగతిని గుర్తు చేశారు. తెలంగాణలో షర్మిల స్థాపించిన వైఎస్ఆర్టీపీ పార్టీ ప్రభావం చూపదని అన్నారు. గతంలో తెలంగాణకు మద్దతు ఇవ్వని షర్మిల.. ఇప్పుడు తాను తెలంగాణ ఆడపడుచునంటూ ఇక్కడ పోటీ చేయడానికి సిద్దమైతే ఆమెకు అధికారం ఇచ్చే పరిస్థితుల్లో ప్రజలు లేరని అన్నారు.
ప్రత్యేకమైన సెంటిమెంట్ తో రాష్ట్ర ప్రజలు తెలంగాణను సాధించుకున్నారని, అలాంటి రాష్ట్రంలో ఎవ్వరికైనా సరే అధికారం వస్తుందనుకోవడం పొరపాటే అవుతుందని అన్నారు. ఆంధ్ర పార్టీలు తెలంగాణలో మనుగడ సాధించలేవని స్పష్టం చేశారు. విభజన సమయంలో ప్రత్యేక కారణంతో పోలవరం ముంపు మండలాలను ఏపీలో కలిపారని డీకే అరుణ చెప్పారు. ఆ సమయంలో అంగీకారం తెలిపిన కేసీఆర్.. ఇప్పుడు రాజకీయ కారణాలతో నాటి నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ముంపు గ్రామాలను తెలంగాణలో కలపాలనే డిమాండ్ చాలా కాలంగా వినిపిస్తుందని అక్కడ మౌలిక వసతులు ఏర్పాటు చేయలేదని విమర్శించారు. కాళేశ్వరం విషయంలో వైఎస్ జగన్, కేసీఆర్ మంచి అండర్ స్టాండింగ్ తో ఉన్నారని ఎన్నికల సమయం వచ్చేసరికి వాళ్లు వ్యతిరేకించుకుంటున్నారని విమర్శించారు. త్వరలో బీజేపీలోకి పెద్ద ఎత్తున చేరికలు జరుగుతాయని, ఈ అంశాన్ని హైకమాండ్ చూసుకుంటుందని వివరించారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని డీకే అరుణ పిలుపునిచ్చారు. ఆగస్టు 13 నుంచి 15వ తేదీ వరకు ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా 20 కోట్ల ఇళ్లపై జెండాలు ఎగుర వేయాలనే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆమె వివరించారు .