భర్తతో విడాకులు.. వారితో ఎంజాయ్ చేస్తున్న ఐశ్వర్య రాయ్.. ఫొటోలు వైరల్..

by Kavitha |   ( Updated:2024-10-24 15:54:17.0  )
భర్తతో విడాకులు.. వారితో ఎంజాయ్ చేస్తున్న ఐశ్వర్య రాయ్.. ఫొటోలు వైరల్..
X

దిశ, సినిమా: బాలీవుడ్ స్టార్ కపూల్ అభిషేక్ బచ్చన్- ఐశ్వర్య రాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ 2007లో ప్రేమ వివాహం చేసుకున్నారు. ఇక వీరికి ఆరాధ్య అనే పాప కూడా జన్మించింది. ఇదిలా ఉంటే, గత కొన్ని రోజులుగా ఐష్, అభిషేక్ విడాకులు తీసుకోబోతున్నారనే పుకారు నెట్టింట షికార్లు చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై వీరిద్దరూ స్పందించకపోవడంతో ఈ వార్తలకు బ్రేక్ పడింది. ఈ క్రమంలో ఐష్‌కు సంబంధించిన ఓ న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది.

గత కొన్ని రోజులుగా ఐశ్వర్య రాయ్ ఎక్కడికి వెళ్లినా కేవలం తన కూతురితోనే కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఐశ్వర్య రాయ్ తన ఫ్యామిలీతో క్వాలిటీ సమయాన్ని గడిపారు. ఐశ్వర్య రాయ్ తన కూతురు ఆరాధ్యతో కలిసి తన కజిన్ పుట్టిన రోజు వేడుకలకు హాజరయ్యారు. ఇక విడాకుల రూమర్స్ తర్వాత ఐశ్వర్య తన భర్త లేకుండా కేవలం తన కూతురుతో మాత్రమే కనిపించడంతో ఈ ఫోటో సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఇక ఆ ఫోటో గమనిస్తే.. ఐశ్వర్య రాయ్ స్కూల్ యూనిఫార్మ్‌లో ఉన్న తన కూతురిని పట్టుకొని ఉంది. ఆ పక్కనే తన తల్లి కూడా ఉంది. మొత్తానికి ఐశ్వర్య తన భర్త లేకుండా ఫ్యామిలీతో మాత్రమే ఫొటోస్ పెట్టడంతో.. ఐష్ తన భర్తకి విడాకులు ఇచ్చేసి ఒంటరిగా ఉంటుందేమో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మరి వీరు నిజంగా విడాకులు తీసుకున్నారా లేదా అనేది తెలియాలంటే వీరిద్దరిలో ఎవరో ఒకరు స్పందించే వరకు వెయిట్ చేయాల్సిందే.


Advertisement

Next Story