వాడుకున్నారు.. వదిలేస్తున్నారు

by Nagaya |
వాడుకున్నారు.. వదిలేస్తున్నారు
X

దిశ, తెలంగాణ బ్యూరో : కొవిడ్ సమయంలో సేవలు అందించిన వైద్యసిబ్బందిని తొలగించాలని సర్కార్ నిర్ణయించింది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్​టైంలో రిక్రూటైన డాక్టర్లు, నర్సులు, పారమెడికల్​స్టాఫ్‌ను​ఈ నెల 31 తర్వాత ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో అప్పట్లో ఆసుపత్రుల్లో చేరిన 894 మంది వైద్యసిబ్బంది ఆందోళన చెందుతున్నారు. గడువు ముగిసినప్పటికీ ఆసుపత్రుల్లో ఇప్పటికీ అనేక ఖాళీలున్నాయి. అయినా వారిని చేర్చుకునేందుకు ప్రభుత్వం ఆసక్తి చూపడం లేదు. కరోనా ప్యాండమిక్​ సమయంలో ప్రాణాలు తెగించి పోరాడిన తమకు న్యాయం చేయాలని పలువురు డాక్టర్లు, నర్సులు, ల్యాబ్​టెక్నిషియన్లు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రభుత్వ దవాఖాన్లలో తాము అద్బుతమైన సేవలు అందించామని, తమపై కనికరం చూపాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రత్యమ్నయ మార్గాలు వెతుక్కోవాలంటే కష్టతరం అని విన్నపిస్తున్నారు.

కాంట్రాక్ట్​ మెథడ్​లో...

కరోనా సేవలు అందించేందుకు సర్కార్​గతేడాది ఆగస్ట్, సెప్టెంబర్‌‌లో 613 మంది డాక్టర్లను కాంట్రాక్ట్‌ విధానంలో, 79 మంది ఫార్మసిస్ట్‌లు, 202 మంది ల్యాబ్ టెక్నీషియన్లను అవుట్‌సోర్సింగ్ విధానంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లో నియమించారు. గడువు ముగియడంతో వారిని తొలగించాలని ఉన్నతాధికారులు అన్ని దవాఖాన్ల సూపరింటెండెంట్లకు ఆదేశాలిచ్చారు.

అయితే రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్లు, నర్సులు, పారమెడికల్​ స్టాఫ్​ కొరత ఉన్నప్పటికీ విరిని తొలగించాలని నిర్ణయం తీసుకోవడం విచిత్రంగా ఉన్నది. కష్టకాలంలో పేదలను కాపాడేందుకు నిర్విరామంగా పనిచేసిన స్టాఫ్‌ను రెగ్యులర్​ చేయాల్సింది పోయి రోడ్డుకు ఈడ్చే ప్రయత్నం చేయడం దారుణం. మరోవైపు కొత్త మెడికల్​ కాలేజీల్లోనూ భారీగా ఖాళీలున్నాయి. అయినా సర్కార్​ అనాలోచిత నిర్ణయాలతో వైద్యసిబ్బందిని పరేషాన్​ చేస్తున్నది.

Advertisement

Next Story