- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Director Vassishta: నా అకౌంట్ హ్యాక్ అయింది.. అలాంటి మెసేజ్‌లు పట్టించుకోవద్దు.. విశ్వంభర డైరెక్టర్ షాకింగ్ పోస్ట్
దిశ, సినిమా: నందమూరి కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ (Bimbisara) సినిమాతో స్టార్ డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు వశిష్ట (Director Vassishta). ప్రజెంట్ ఈయన మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi)తో ‘విశ్వంభర’ (Viswambhara) చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. అత్యంత భారీ బడ్జెట్ (huge budget)తో రూపొందుతోన్న ఈ మూవీ వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్‌గా మే లో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు చిత్ర బృందం. దీంతో ప్రజెంట్ ఈ మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు డైరెక్టర్ వశిష్ట. ఇదిలా ఉంటే.. డైరెక్టర్ వశిష్ట తాజాగా సోషల్ మీడియా (Social Media)లో ఓ షాకింగ్ పోస్ట్ పెట్టాడు. తన టెలిగ్రామ్ అకౌంట్ హ్యాక్ (Telegram Account Hack) అయినట్లు చెప్పుకొచ్చాడు.
ఈ మేరకు X వేదికగా.. ‘అందరికీ హాయ్.. ఇప్పుడే నా టెలిగ్రామ్ అకౌంట్ హ్యాక్ అయిందనే విషయాన్ని నేను గుర్తించాను. నా టెలిగ్రామ్ అకౌంట్ నుంచి మీకు ఏదైనా మెసేజ్ వస్తే మాత్రం వాటిని దయచేసి పట్టించుకోవద్దు.. ధన్యవాదాలు’ అంటూ ఓ నోట్ షేర్ చేశాడు. ప్రజెంట్ ఈ పోస్ట్ వైరల్‌గా మారగా.. ఇలాంటి విషయాల్లో సినీ సెలబ్రిటీలు కూడా అలర్ట్‌గా ఉండాలంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు.
Read More...
Sub Inspector Yugandhar: సబ్ ఇన్‌స్పెక్టర్‌గా స్టార్ హీరో కొడుకు.. నెట్టింట ఫొటోలు వైరల్