'ఆర్ఆర్ఆర్' స్టోరీ ఇదే.. అంతా చెప్పేసిన విజయేంద్ర ప్రసాద్

by GSrikanth |   ( Updated:2022-03-24 07:13:16.0  )
ఆర్ఆర్ఆర్ స్టోరీ ఇదే.. అంతా చెప్పేసిన విజయేంద్ర ప్రసాద్
X

దిశ, డైనమిక్ బ్యూరో: దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ సినిమా భారీ అంచనాలతో ఈ నెల 25న రిలీజ్ కానుంది. భారీ బడ్జెట్‌తో మూడేళ్ల పాటు శ్రమించి నిర్మించిన చిత్ర విశేషాలను చిత్ర యూనిట్ ఎంతో సీక్రెట్‌గా ఉంచుతూ వస్తోంది. ఈక్రమంలో సినిమా గురించి ఎలాంటి లీక్స్ జరగకుండా జక్కన్న జాగ్రత్తలు తీసుకున్నారు. కానీ, సినిమా కథను రాసిన రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.. ప్రమోషన్‌లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని 'ఆర్ఆర్ఆర్' సినిమా స్టోరీలోని కొన్ని సన్నివేశాల గురించి చెప్పేశారు.

ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ''రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ ప్రాణస్నేహితులని, ఒకరంటే ఒకరికి ప్రాణమని. కానీ, ఇద్దరి ఆలోచనలు వేరు. ఇద్దరూ వ్యతిరేక ద్రువాల్ల ఉన్నట్లు ఉంటారు. ఇలాంటి సమయంలో ఇద్దరి మధ్య గొడవ అవ్వడంతో ఇద్దరు కొట్టుకుంటారు. సినిమా చూసే వాళ్లంతా వాళ్లిద్దరూ కొట్టుకోకుండా ఉంటే బాగుండు అని అనుకుంటారు. వారిద్దరూ కొట్టుకునేటప్పుడు కొండల్లో రెండు సింహాలు దెబ్బలాడుకుంటున్నట్టు ఉంటుంది. సినిమాలో ఇలాంటి ఫైట్స్ చూసి ఎంజాయ్ చేయాలి కానీ నాకెందుకో ఏడుపొచ్చింది. నేను ఈ సినిమాను ఐదు సార్లు చూశాను. ప్రతి సారీ ఎన్టీఆర్, చరణ్ కొట్టుకుంటుంటే కన్నీళ్లు వచ్చాయని, ప్రేక్షకులకు కూడా ఈ సన్నివేశాల్లో కన్నీళ్లు రావడం ఖాయం'' అని ఆయన అన్నారు. ఇలా సినిమాలో జరిగిన సన్నివేశాలను మీడియాతో పంచుకున్న ఆయన.. 'ఆర్ఆర్ఆర్'పై మరింత అంచనాలను పెంచేశారు. ఇదిలా ఏండగా.. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా జక్కన్న, ఎన్టీఆర్, రామ్ చరణ్‌లు దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాలను పర్యటిస్తూ సందడి చేస్తున్నారు.

Advertisement

Next Story