Roti Kapada Romance: సరికొత్త కథను చూడబోతున్నారు.. కొత్త సినిమాపై హైప్ పెంచేస్తున్న నిర్మాత

by sudharani |
Roti Kapada Romance: సరికొత్త కథను చూడబోతున్నారు.. కొత్త సినిమాపై హైప్ పెంచేస్తున్న నిర్మాత
X

దిశ, సినిమా: యూత్ ఫుల్ (Youthful) చిత్రాలను నిర్మించడంలో ముందుండే ప్రముఖ నిర్మాత, లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్ (Bekkem Venugopal), సృజన్‌ కుమార్ (Srujan Kumar) బొజ్జంతో కలిసి నిర్మించిన చిత్రం ‘రోటి కపడా రొమాన్స్’ (Roti Kapada Romance). విక్రమ్ రెడ్డి (Vikram Reddy) దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. నవంబరు 22న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్న సందర్భంగా తాజాగా మీడియాతో ముచ్చటించారు చిత్ర బృందం.

ఈ సందర్భంగా నిర్మాత బెక్కెం వేణుగోపాల్‌ మాట్లాడుతూ.. ‘నేటి యువతరానికి నచ్చే అంశాలతో పాటు కుటుంబ భావోద్వేగాల మేళవింపుతో యూత్‌ఫుల్‌ రొమాంటిక్‌ (romantic) ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ (Family Entertainer) గా ఈ చిత్రం తెరకెక్కింది. ఇందులోని ప్రతి పాత్ర అందరికి కనెక్ట్‌ అయ్యే విధంగా ఉంటుంది. రొమాన్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్‌, ఎమోషన్స్‌ (emotions) ఈ చిత్రానికి ప్రధాన బలాలు. అంతే కాదు ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి ప్రమోషనల్‌ కంటెంట్‌ (Promotional Content) కు మంచి స్పందన వస్తోంది. తప్పకుండా ఈ మూవీ అందరికి నచ్చుతుందనే నమ్మకం ఉంది’ అన్నారు.

డైరెక్టర్ విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ఇదొక సరికొత్త యూత్‌ఫుల్‌ ఎంటర్‌టైనర్‌. ఇందులో వచ్చే ప్రతి సన్నివేశంలో ఓ ఎమోషన్‌ ఉంటుంది. ఆడియన్స్‌ ఈ నెల 22న ఓ సరికొత్త కథతో పాటు విజువల్స్, మేకింగ్‌ను చూడబోతున్నారు. ముఖ్యంగా సినిమాలో లాస్ట్‌ 20 నిమిషాలు అందరి హృదయాలను హత్తుకుంటుంది. సినిమా చూసిన వెళ్లిన తర్వాత కూడా ఆ పాత్రలు మిమ్ములను వెంటాడుతాయి’ అని చెప్పుకొచ్చారు.

Advertisement

Next Story