- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'బీజేపీ దళితులకు ఉపయోగపడే ఏ ఒక్క పథకాన్ని తేలేదు': ఎమ్మెల్యే
దిశ, స్టేషన్ ఘన్ పూర్ : 7 ఏళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ.. దళితులకు ఉపయోగపడే ఏ ఒక్క పథకాన్ని తేలేదని స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ టి. రాజయ్య ధ్వజమెత్తారు. దళితుల సంక్షేమం కోసం టీఆర్ఎస్ తెచ్చిన దళితబంధు పథకాన్ని చూసి ఓర్వలేక బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని ఆయన అన్నారు. జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్‌లో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. దళిత ఉద్ధరణ సీఎం కేసీఆర్ లక్ష్యమని, దళిత బంధు పథకంపై ప్రతిపక్షాలు ఓర్వలేక చేస్తున్న ఆరోపణలు సరికాదని అన్నారు. దళిత బంధు లబ్ధిదారుల ఎంపికపై వచ్చిన ఆరోపణలను ఆయన తిప్పికొట్టారు. దళితుల స్థితిగతులు తెలిసిన సీఎం.. వారి సమగ్ర అభివృద్ధికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు.
హుజురాబాద్, వాసాలమర్రి తరహాలో రాష్ట్ర వ్యాప్తంగా దళిత బంధు అమలుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. నియోజకవర్గానికి 100 మంది చొప్పున తొలి దశలో అందించి.. విడతల వారీగా ప్రతి దళిత కుటుంబానికి ఈ పథకం వర్తింపచేస్తారని వెల్లడించారు. 44 ఏళ్లుగా ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గంగా కొనసాగుతున్న స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో 25 వేల ఎస్సీ కుటుంబాలు ఉన్నాయని, వారందరిని బాగు చేసే బాధ్యత నాది అన్నారు. ఊపిరి ఉన్నంతవరకు నియోజకవర్గ అభివృద్ధి, ప్రజల యోగక్షేమాలు లక్ష్యంగా అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేస్తానని వివరించారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.