అవకాశాల విషయంలో సవాళ్లు ఎదుర్కొన్నా.. పవన్ కల్యాణ్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్

by Hamsa |
అవకాశాల విషయంలో సవాళ్లు ఎదుర్కొన్నా.. పవన్ కల్యాణ్ హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ మీరా చోప్రా(Meera Chopra) తెలుగు, తమిళ, హిందీ చిత్రాల్లో నటించి మెప్పించింది. ముఖ్యంగా తెలుగులో పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) ‘బంగారం’ సినిమాతో ఫుల్ క్రేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత పలు మూవీస్ చేసి బాలీవుడ్‌కు చెక్కేసింది. అయితే అక్కడ పెద్దగా ఆఫర్లు రాకపోవడంతో అడపా దడపా చిత్రాలు చేస్తూ ఇండస్ట్రీలో కొనసాగుతోంది. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మీరా చోప్రా (Meera Chopra) ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ‘‘నాకు ప్రియాంక చోప్రా(Priyanka Chopra) దగ్గరి బంధువు అవుతారు.

అయితే మాదొక మధ్య తరగతి కుటుంబం ఆమె సినిమాల్లోకి రావడంతో ఈ రంగంపై నాకు ఆసక్తి పెరిగింది. 2005లో విడుదలైన ‘అన్బే అరుయిరే’ చిత్రంతో ఇండస్ట్రీకి వచ్చాను. దాదాపు 25 సినిమాల్లో యాక్ట్ చేశాను. దక్షిణాదిలో యాక్టింగ్ చేయడం ఇష్టం లేదు. ఎందుకంటే నాకు భాషాపరమైన ఇబ్బందులు తలెత్తాయి. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టిన సమయంలో అవకాశాల విషయంలోనూ సవాళ్లు ఎదుర్కొన్నా. ఆఫర్స్ కోసం ఎవరిని కలవాలో అర్థం కాలేదు. కొంతమంది అవకాశాలు ఇచ్చినట్టే ఇచ్చి తర్వాత వేరేవాళ్లను తీసుకునేవారు. అప్పుడు నేను ఎంతో బాధపడేదాన్ని’’ అని చెప్పుకొచ్చింది.

Advertisement

Next Story