డార్లింగ్ ఫ్యాన్స్ గెట్ రెడీ..‘రాజాసాబ్’ అప్డేట్‌ వచ్చేది అప్పుడే (పోస్ట్)

by Hamsa |
డార్లింగ్ ఫ్యాన్స్ గెట్ రెడీ..‘రాజాసాబ్’ అప్డేట్‌ వచ్చేది అప్పుడే (పోస్ట్)
X

దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్(Prabhas) నటిస్తున్న తాజా చిత్రం ‘రాజాసాబ్’(Rajasab). దీనిని మారుతి తెరకెక్కిస్తుండగా.. ఇందులో మాళవిక మోహనన్ (Malavika Mohanan)హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే ఈ మూవీతో పాటు ప్రభాస్(Prabhas) మూడు, నాలుగు చిత్రాలు లైన్‌లో పెట్టారు. అయితే డార్లింగ్ ఫ్యాన్స్ మాత్రం వాటికి సంబంధించిన అప్డేట్స్ కోసంఅభిమానులు ఎంతో ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాయి. ఈ క్రమంలో.. అక్టోబర్ 23న పుట్టిన రోజు కావడంతో ఆ రోజు అయినా అప్డేట్స్ వస్తాయని అంతా భావిస్తున్నారు. అలాగే ఆయన బర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహించేందుకు అభిమానులు సిద్ధం అయ్యారు.

తాజాగా, ‘రాజా సాబ్’ (Rajasab).అప్డేట్ అక్టోబర్ 23న విడుదల కాబోతున్నట్లు అధికారిక ప్రకటనను విడుదల చేశారు మేకర్స్. కుర్చీకి ఓ మూలన మంటలు అంటుకుని ఉండగా.. దాన్ని రివర్స్‌లో పోస్ట్ చేశారు. సింహాసనం ఖాళీగా లేదు. అది ఓ వ్యక్తి కోసం ఎదురుచూస్తుంది అతను రేపు వస్తున్నాడు’’ అనే క్యాప్షన్ జత చేశారు. ప్రజెంట్ ఈ పోస్టర్ చూసిన డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. అయితే బుధవారం నాడు గ్లింప్స్ రాబోతున్నట్లు తెలుస్తోంది. కాగా, రాజాసాబ్(Rajasab) సినిమా ఏప్రిల్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్‌లో విడుదల కాబోతుంది.

Advertisement

Next Story