'దర్జా'తో కష్టానికి తగిన ఫలితం దక్కుతుందన్న మేకర్స్..

by Manoj |
దర్జాతో కష్టానికి తగిన ఫలితం దక్కుతుందన్న మేకర్స్..
X

దిశ, సినిమా : టాలీవుడ్ హీరో సునీల్, అనసూయ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'దర్జా'. ఫిక్షన్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌‌గా రాబోతున్న సినిమాకు సలీమ్ మాలిక్ దర్శకత్వం వహిస్తుండగా కామినేని శ్రీనివాస్ సమర్పణలో పిఎస్ఎస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై శివశంకర్ పైడిపాటి నిర్మిస్తున్నారు. కోఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌‌గా రవి పైడిపాటి వ్యవహరిస్తున్నారు. కాగా ఈ మూవీ జూలై 22న విడుదల కాబోతున్న సందర్భంగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు మేకర్స్.

ఈ కార్యక్రమంలో బిగ్ టికెట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత నవీన్ ఎర్నేని విడుదల చేయగా.. 'ఉప్పెన' దర్శకుడు బుచ్చిబాబు, సందీప్ మాధవ్, వీరశంకర్, ఉత్తేజ్, కరీంనగర్ సిటీ కమిషనర్ సత్యనారాయణ, తదితరులు అతిథులుగా హాజరయ్యారు. ఈ మేరకు ట్రైలర్స్, సాంగ్స్ బాగున్నాయని, ఈ సినిమా తప్పకుండా ఘనవిజయం సాధిస్తుందని ఆల్ ద బెస్ట్ చెప్పారు. అలాగే అనసూయ, సునీల్‌, ఇతర ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులకు స్పెషల్ థాంక్స్ చెప్పిన మేకర్స్.. తమ కష్టానికి తగినట్లుగానే ప్రేక్షకులు సక్సెస్‌ను ఇస్తారని నమ్ముతున్నామన్నారు.

Advertisement

Next Story