- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎయిర్ ఫోర్స్‌లో మరో రికార్డ్.. ఒకే యుద్ధ విమానాన్ని నడుపుతున్న తండ్రి, కూతురు
దిశ, వెబ్ డెస్క్: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో మరో రికార్డ్ నమోదయ్యింది. ఒకే యుద్ధ విమానాన్ని తండ్రీకూతురు నడిపి చరిత్ర సృష్టించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. ఎయిర్ కమోడర్ సంజయ్ శర్మ 1989లో ఎయిర్ ఫోర్స్ లో చేరి యుద్ధ విమానాలు నడపడంలో ఆరి తేరారు. విజయవంతమైన పలు ఆపరేషన్లలో కూడా సంజయ్ కూడా ఉన్నారు. అయితే, ఆయన కూతురు అనన్య బీటెక్ పూర్తి చేసింది. ఆమెకు కూడా యుద్ధ విమానాన్ని నడపాలన్న కోరిక చాలా ఉండేది. ఇందుకోసం ఆమె తీవ్రంగా ప్రయత్నించి శిక్షణకు ఎంపికైంది. 2021లో శిక్షణను కంప్లీట్ చేసుకుని పూర్తి స్థాయిలో ఫైటర్ పైలట్ అయ్యింది. అయితే, ఇటీవల ఓ కార్యక్రమంలో ఒకే యుద్ధ విమానాన్ని తండ్రీకూతుర్లిద్దరూ కలిసి నడిపారు. ఈ విషయం తెలిసి అంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఆమె తల్లి సోనల్ శర్మ మాట్లాడుతూ... 'నేనెప్పుడు ఇలా ఊహించలేదు. నా ఆనందానికి అవధులు లేవు' అంటూ చెప్పుకొచ్చింది.