- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
చనిపోయిన వ్యక్తిపై ఎఫ్ఐఆర్.. పోలీసులకు షాక్ ఇచ్చిన హైకోర్టు
దిశ, శేరిలింగంపల్లి: సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో వింత ఘటన చోటుచేసుకుంది. ఓ భూ వివాదానికి సంబంధించిన విషయంలో చనిపోయన వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. శేరిలింగంపల్లి మండలంలో 3 ఎకరాల భూమి మాదంటే మాదని ఓ రియల్టర్‌కు మరో వ్యక్తికి మధ్య కొన్నాళ్లుగా వివాదం జరుగుతోంది. అయితే సదరు రియల్టర్ ప్రత్యర్థి రైతుపై, అతడి తండ్రిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భూమిలోకి ప్రవేశించి కబ్జాకు యత్నించారని, హద్దురాళ్లను తొలగించారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. దీంతో ఎస్ఐ ఎలాంటి విచారణ చేయకుండానే రైతు, అతడి తండ్రిపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.
41 సీఆర్పీ కింద నోటీసులు జారీచేశారు. దీంతో బాధిత రైతు హైకోర్టును ఆశ్రయించాడు. తన తండ్రి గతేడాది ఏప్రిల్‌లో మరణిస్తే పోలీసులు నవంబర్‌లో స్థలం కబ్జా చేశాడంటూ కేసు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని అఫిడవిట్‌కు జతచేసి కోర్టుకు సమర్పించాడు. దీనిపై హైకోర్టు స్పందించి సైబరాబాద్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది. ఈ ఘటనపై మాదాపూర్ డీసీపీ శిల్పవల్లిని వివరణ కోరగ చనిపోయిన వ్యక్తిపై కేసు నమోదు చేసింది వాస్తవమేనని తెలిపారు. అనంతరం తమ విచారణలో అతను చనిపోయాడని తెలిసిందని, డెత్ సర్టిఫికెట్ కలెక్ట్ చేశామని వివరించారు.