Tirumala: తిరుమలలో ఉద్రిక్తత.. టోకెన్ల కోసం తోపులాట

by samatah |   ( Updated:2022-04-12 08:47:07.0  )
Tirumala: తిరుమలలో ఉద్రిక్తత.. టోకెన్ల కోసం తోపులాట
X

దిశ, వెబ్‌డెస్క్ : తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులతో కిటకిటలాడుతోంది. దీంతో శ్రీవారి సర్వదర్శనం టోకెన్ కేంద్రాల వద్ద తోపులాట చోటు చేసుకుంది. రెండు రోజులు టోకెన్ల పంపిణీ నిలిపివేయడంతో ఈ రోజు భక్తులు పెద్ద ఎత్తున టికెట్ల కోసం క్యూలైన్‌లో నిల్చున్నారు. దీంతో అక్కడి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. భక్తుల మధ్య తోపులాట జరిగింది. ఈ ఘటనలో పలువురు భక్తులకు తీవ్రగాయలు అయ్యాయి. వెంటనే అధికారులు అప్రమత్తమై భక్తుల తోపులాటను నిలిపి వేశారు. అనంతరం గోవిందరాజస్వామి సత్రాలు, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్‌ల దగ్గర టోకెన్లను జారీ చేశారు. దీంతో రేపటి నుంచి సర్వ దర్శనాలను రద్ధు చేసి పరిమిత సంఖ్యలోనే భక్తులకు అనుమతినిచ్చారు టీటీడీ అదనపు డీఈవో.

Advertisement

Next Story

Most Viewed