డ్రైవింగ్‌లో హెడ్ ఫోన్స్ వాడుతున్నారా..! సీపీ స్టీఫెన్ రవీంద్ర కీలక సూచన

by Satheesh |   ( Updated:2022-04-19 07:09:56.0  )
డ్రైవింగ్‌లో హెడ్ ఫోన్స్ వాడుతున్నారా..! సీపీ స్టీఫెన్ రవీంద్ర కీలక సూచన
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ పోలీసులు రోడ్డు ప్రమాదాలపై సోషల్ మీడియా ద్వారా ప్రజలకు అవగాహన కల్పించడంలో ముందుంటారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం వంటి ప్రమాదాలపై వినూత్న ప్రచారం చేస్తారు. ఇటీవల కాలంలో చాలా మంది డ్రైవింగ్ చేసేటప్పుడు బ్లూ టూత్, ఇయర్ ఫోన్స్ వంటివి పెట్టుకుని ప్రమాదాలకు గురవుతున్నారు. సరదా కోసం పాటలు వింటూ చేసే ప్రయాణాలు కొన్ని కుటుంబాలలో తీవ్ర శోకం మిగుల్చుతున్నాయి. అయితే, తాజాగా రోడ్డు ప్రమాదాలపై సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర ట్వీట్టర్ వేదిక ప్రజలకు అవగాహన కల్పించారు. ' డ్రైవింగ్ చేస్తున్నప్పుడు హెడ్ ఫోన్స్ తప్పనిసరి కాదు. మీరు ఇంటి నుంచి బయటకు వెళ్లాక.. సురక్షితంగా ఇంటికి తిరిగి వచ్చే వరకు మీ కోసం ఇంట్లో వాళ్లు ఎదురుచూస్తారనే విషయాన్ని మర్చిపోవద్దు' అని సూచించారు. అందరూ ట్రాఫిక్ రూల్స్ పాటించాలని కోరారు.

గమ్యం చేరాలంటే ఇలా చేయాలి! రోడ్డు ప్రమాదాలపై పోలీసుల వినూత్న ప్రచారం..



Advertisement

Next Story

Most Viewed