పెండింగ్ చలాన్ల చెల్లింపులపై జాయింట్ సీపీ కీలక ప్రకటన..

by Javid Pasha |
పెండింగ్ చలాన్ల చెల్లింపులపై జాయింట్ సీపీ కీలక ప్రకటన..
X

దిశ, డైనమిక్ బ్యూరో: వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడంతో గత ఏడేళ్లలో దాదాపు 15వందల కోట్ల చలాన్లు పెండింగ్‌లో ఉండిపోయాయి. వీటిని క్లియర్ చేసేందుకు పోలీసులు ప్రత్యేకంగా తనిఖీలు కూడా ఏర్పాటు చేశారు. కానీ, ఆశించినంతగా ఫలితం రాకపోవడంతో.. వాహనదారులకు బంపర్ ఆఫర్‌గా డిస్కౌంట్ ఇచ్చి చలాన్లు వసూలు చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలో బైకులు, ఆటోలు మొత్తం పెండింగ్ చలాన్‌లో 75%, లైట్ మోటార్ వెహికిల్స్ (LMVలు), కార్లు, జీపులు, భారీ వాహనాలపై ఉన్న చలాన్లపై 50% డిస్కౌంట్ ఇచ్చింది.

ఈ సదుపాయం మార్చి1 నుంచి చలాన్ల చెల్లింపులకు అవకాశం కల్పించింది. అయితే, ఈ అవకాశం ఈ నెల చివరితో పూర్తికానున్న నేపథ్యంలో ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ కీలక ప్రకటన చేశారు. ఇప్పటి వరకు 600 కోట్ల పెండింగ్ చలాన్లు క్లియర్ అయ్యాయని, దీని ద్వారా ప్రభుత్వ ఖజానాకు రూ.190 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పారు. ఇంకా నెలాఖరు వరకు అవకాశం ఉందని, గడువును పొడగించే ఆలోచన లేదని రంగనాథ్ స్పష్టం చేశారు.

Advertisement

Next Story

Most Viewed