కొవిషీల్డ్, కొవొవాక్స్ బూస్టర్ డోస్ టీకా ధరలపై సీరం అధినేత కీలక వ్యాఖ్యలు

by Vinod kumar |
కొవిషీల్డ్, కొవొవాక్స్ బూస్టర్ డోస్ టీకా ధరలపై సీరం అధినేత కీలక వ్యాఖ్యలు
X

న్యూఢిల్లీ: 18 ఏళ్లు పైబడిన వారికి కేంద్రం బూస్టర్ డోస్‌ను ప్రకటించిన నేపథ్యంలో టీకా ధరలపై సీరం అధినేత అదర్ పూనవాలా కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వాన్ని నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు బూస్టర్ డోస్ లపై కేంద్రం ప్రకటన తర్వాత ఆయన ఎన్డీటీవీ తో మాట్లాడారు. ఇదో కీలకమైన, సమయానుకూల నిర్ణయంగా పేర్కొన్నారు. అనేక దేశాలు బూస్టర్ డోస్ తీసుకోని వారిపై ఆంక్షలు విధించిన తరుణంలో ప్రభుత్వ నిర్ణయం సరైనదని అన్నారు. కొవిషీల్డ్ టీకా ధర రూ.600(అదనంగా పన్నులు)గా నిర్ణయించనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా బూస్టర్ డోస్ గా ఆమోదం పొందితే కొవావాక్స్ టీకా రూ.900(అదనంగా పన్నులు)కు లభిస్తుందని చెప్పారు. 'కొవిషీల్డ్ బూస్టర్ డోస్ గా ఆమోదం పొందింది. కొవొవాక్స్ కూడా బూస్టర్ గా ఆమోదం పొందాల్సి ఉంది' అని అన్నారు. అంతేకాకుండా ఆసుపత్రులు, డిస్ట్రిబ్యూటర్లకు టీకా కొనుగోళ్లలో పెద్ద ఎత్తున డిస్కౌంట్లు కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. కాగా, సీరం సంస్థ తయారు చేసిన కొవొవాక్స్ టీకాను 12-17 ఏళ్ల వారికి అత్యవసర వినియోగానికి అనుమతులు పొందిన సంగతి తెలిసిందే. మరోవైపు కేంద్రం 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరూ బూస్టర్ డోస్ తీసుకునేందుకు అనుమతులు ఇచ్చింది. ఆదివారం నుంచి ప్రైవేట్ టీకా కేంద్రాల్లో తీసుకోవచ్చని ప్రకటన విడుదల చేసింది.

Advertisement

Next Story