Ajit Pawar: మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రికి కరోనా పాజిటివ్

by S Gopi |   ( Updated:2022-06-27 17:07:41.0  )
Maharashtra Deputy CM Ajit Pawar Tests Positive For Corona
X

దిశ, వెబ్‌డెస్క్: Maharashtra Deputy CM Ajit Pawar Tests Positive For Corona| మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కీలక మలుపు తిరుగుతున్న సమయంలో మొదట గవర్నర్‌కు కొవిడ్ సోకగా ఆ తరువాత సీఎం ఉద్ధవ్ థాక్రేకు సోకింది. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి అయిన ఎన్సీపీ నేత అజిత్ పవార్‌కు కరోనా పాజిటివ్‌గా వచ్చినట్లుగా తన ట్విట్టర్‌లో వెల్లడించారు. తన ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని మీ అందరి దీవెనలతో నేను త్వరలో కరోనాను ఓడించి వస్తానని, ఇటీవల తనను కలిసిన వారు కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అయితే, ఆయన ఇటీవల సీఎం ఉద్ధవ్ థాక్రేను కలవడం విశేషం. ఇదిలా ఉండగా మహారాష్ట్రలో రోజురోజుకూ కరోనా కేసులు పెరుగుతూ పోతున్నాయి. ఆదివారం కొవిడ్ కేసులు 6493 నమోదయ్యాయి. కరోనాతో ఐదుగురు మరణించారు.

Advertisement

Next Story

Most Viewed