ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు

by Manoj |
ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు
X

దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ ప్రకారం గడచిన 24 గంటల్లో 11,846 మందికి పరీక్షలు నిర్వహించారు. 75 మందికి కొవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఇప్పటి వరకు పాజిటివ్‌ల సంఖ్య 23,19,141కి చేరింది. కాగా గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా ఎవరూ మృతి చెందలేదు. ఇప్పటి వరకు కరోనాతో 14,730 మంది మరణించారు. ప్రస్తుతం 536 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ సంఖ్య 23,03,875కు చేరింది. ఇప్పటి వరకు 3,33,14,755 శాంపిల్స్‌‌ను పరీక్షించారు.

Advertisement

Next Story