భారత్‌లో పెరుగుతున్న కరోనా.. కొత్త కేసులెన్నో తెలుసా?

by Mahesh |
భారత్‌లో పెరుగుతున్న కరోనా.. కొత్త కేసులెన్నో తెలుసా?
X

దిశ, వెబ్‌డెస్క్: భారతదేశంలో కరోనా కేసులు డైలీ పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో భారత్‌లో 15,528 కొత్త కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ నివేదిక ప్రకారం ప్రస్తుతం భారత్‌లో 1,43,654 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. 24 గంటల్లో 25 మంది కరోనాతో మృతి చెందగా.. ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 5,25,785కి చేరుకుంది. అయితే వరుసగా రెండు రోజులు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 18 వేలకు పైగా నమోదవుతుండటంతో ప్రజల్లో ఆందోళన పెరిగిపోతుంది.

Advertisement

Next Story