- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఫిబ్రవరిలో 5.8 శాతం వృద్ధి సాధించిన కీలక రంగాలు!
న్యూఢిల్లీ: ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తి ఈ ఏడాది ఫిబ్రవరిలో 5.8 శాతం వృద్ధిని సాధించినట్టు వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖ గణాంకాలు గురువారం వెల్లడించాయి. అంతకుముందు జనవరిలో 4 శాతం వృద్ధి నమోదవగా, గతేడాది ఇదే నెలలో 3.3 శాతం ప్రతికూలత నమోదైంది. ముడి చమురు, ఎరువులు మినహా అన్ని రంగాలు ఫిబ్రవరిలో సానుకూల వృద్ధిని నమోదు చేశాయని మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సమీక్షించిన నెలలో బొగ్గు 6.6 శాతం, సహజ వాయువు 12.5 శాతం, రిఫైనరీ ఉత్పత్తులు 8.8 శాతం, ఉక్కు 5.7 శాతం, సిమెంట్ 5 శాతం, విద్యుత్ 4 శాతం వృద్ధిని సాధించగా, ముడి చమురు 2.2 శాతం, ఎరువులు 1.4 శాతం ప్రతికూల వృద్ధి నమోదు చేశాయి. ఇక, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-ఫిబ్రవరి మధ్య కాలంలో ఎనిమిది కీలక రంగాల ఉత్పత్తి 11 శాతంగా ఉందని, అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే కాలంలో 8.1 శాతం తగ్గిందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.