పోలీస్ కానిస్టేబుల్‌పై ఎద్దు దాడి.. వీడియో వైరల్

by S Gopi |   ( Updated:2022-04-03 08:29:53.0  )
పోలీస్ కానిస్టేబుల్‌పై ఎద్దు దాడి.. వీడియో వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: విధులు నిర్వహిస్తున్న పోలీస్ పై ఎద్దు దాడి చేసిన సంఘటన దేశ రాజధానిలో చోటు చేసుకుంది. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఢిల్లీలోని దయాల్‌పూర్ ప్రాంతంలో గురువారం సాయంత్రం ఓ పోలీస్ పై ఎద్దు దాడి చేసింది. దయాల్‌పూర్‌లోని షేర్‌పూర్‌ చౌక్‌లో విధులు నిర్వహిస్తుండగా ఈ ఘటన జరిగింది. జ్ఞాన్‌సింగ్‌ అనే కానిస్టేబుల్‌ పై ఓ ఎద్దు వెనుక నుంచి వచ్చి దాడి చేసింది. దీంతో అతను గాలిలోకి ఎగిరి నేలపై పడ్డాడు. అక్కడే విధుల్లో ఉన్న ఇతర పోలీసులు అతడిని ఆసుపత్రికి తరలించారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Advertisement

Next Story