- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీఎం రేవంత్ రెడ్డి.. జడ్చర్లలో హోరెత్తిన నినాదం
దిశ, జడ్చర్ల : మన ఊరు- మన పోరు కార్యక్రమానికి బయలుదేరిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి జడ్చర్ల లో అభిమానులు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్‌లో నేడు జరిగే మన ఊరు- మన పోరు కార్యక్రమానికి బయలుదేరిన ఆయనకు జడ్చర్ల నియోజకవర్గం బాలనగర్, రాజాపూర్, జడ్చర్ల లో అభిమానులు వాహనాలు, బైకులతో భారీ ర్యాలీ నిర్వహిస్తూ ఘన స్వాగతం పలికారు.
రేవంత్ రెడ్డికి అడుగడుగునా భారీ గజమాలలతో సత్కరించారు. సీఎం సీఎం.. సీఎం రేవంత్ రెడ్డి అంటూ నినాదాలు చేస్తూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డితోపాటు జడ్చర్ల నియోజకవర్గ టీపీసీసీ సమన్వయకర్త జనుంపల్లి అనిరుద్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ జడ్చర్ల అధ్యక్షుడు, పీసీసీ కార్యదర్శి రబ్బాని మీనాజ్, మిడ్జిల్ అధ్యక్షుడు అల్వాల్ రెడ్డి, జడ్చర్ల మాజీ ఎంపీపీ నిత్యానందం, మిడ్జిల్ ఎంపీటీసీ గౌస్ సంపత్ కుమార్ భారీ ఎత్తున కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.