- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఈ మాటైన కార్యరూపం దాల్చేనా.. రేవు దాటాక తెప్ప తగిలేయవుగా కేసీఆర్..!
దిశ సిద్దిపేట: కేసీఆర్ ఎనిమిదేండ్ల పాలనలో ఇది నాలుగొవ నోటిఫికేషన్ అని ఆ నోటిఫికేషన్‌ల ద్వార ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని ఈసారి కూడా నిరుద్యోగుల ఆశల పైన నీళ్ళు చల్లడమేన అని పీసీసీ మాజీ భూ కమిటీ సభ్యుడు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మిట్టపల్లి గణేష్ అన్నారు. చిన్నకోడూర్ మండల పరిధిలోని రామునిపట్ల లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడి కేసీఆర్ ముఖ్యమంత్రి గా ఎనిమిదేండ్లు గడుస్తున్నా ఆయన పాలనలో ఇది నాలుగవ ఉద్యోగ ప్రకటన అని ఇప్పుడైనా కార్యరూపం దాల్చి నిరుద్యోగులకు ఉద్యోగాలు లభించేనా అని అన్నారు.
నేటి ప్రకటన చూస్తుంటే గతంలో లాగానే ముందస్తు ఎన్నికలు నిర్వహించడానికే అన్నట్లు ఉందన్నారు. నిరుద్యోగులను దళితులను మభ్యపెట్టి మోసపూరితంగా మరోసారి అధికారం చేపట్టాలని చూస్తున్నాడని దళిత బంధు తో దళితులను, ఉద్యోగాల పేరిట నిరుద్యోగులను మోసం చేయాలని చూస్తున్నాడని అన్నారు. ఈసారి ఉద్యోగ నోటిఫికేషన్ పూర్తి చేయకుండా ఎన్నికలకు దిగితే టీఆర్ఎస్ ను బొంద పెట్టడం ఖాయమని అన్నారు.