- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Basavaraj Bommai: వాటిపై నిరసన తెలిపే హక్కు కాంగ్రెస్‌కు లేదు: సీఎం
దిశ, వెబ్‌డెస్క్: నిత్యావసరాల ధరల విషయంలో నిరసనలు తెలిపే హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని కర్ణాటక సీఎం బసవరాజు బొమ్మై అన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో నిత్యావసరాల ధరలు పెరగడం కారణంగా సామాన్య మానవుడికి జీవనం కొనసాగించడం కష్టంగా మారిందని, ప్రభుత్వం వెంటనే ధరలపై దృష్టి సారించాలంటూ కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ ఇటీవల అన్నారు. దానిపై స్పందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి ఘాటుగా రిప్లై ఇచ్చారు. దేశంలో నిత్యవసరాల ధరలో అత్యధికంగా పెంచిన ఘనత, రికార్డు కాంగ్రెస్ పార్టీకే చెందుతాయని బొమ్మై ఎద్దేవా చేశారు. అంతేకాకుండా వారు అధికారంలో ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా ధరలు పెంచారని, ఇప్పుడు రాష్ట్రంలోని పరిస్థితుల కారణంగా ధరలు పెరుగుతుంటే ప్రభుత్వాన్ని తప్పు పడుతున్నారని బొమ్మై అన్నారు. అంతేకాకుండా ఈ విషయంలో నిరసనలు, ఆందోళనలు తెలిపే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని ఆయన అన్నారు.