బిగ్ బ్రేకింగ్... మల్లు స్వరాజ్యం కన్నుమూత

by Javid Pasha |   ( Updated:2022-03-19 14:26:08.0  )
బిగ్ బ్రేకింగ్... మల్లు స్వరాజ్యం కన్నుమూత
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మాజీ ఎమ్మెల్యే మల్లు స్వరాజ్యం శనివారం సాయంత్రం కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బంజారాహిల్స్‌లోని కేర్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని వైద్యులు ప్రకటించారు. ఆమె భౌతికకాయాన్ని ఆస్పత్రి నుంచి నేరుగా ఎంబీ భవన్‌కు తరలించనున్నారు. ఊపిరితిత్తుల సమస్యతో కొంతకాలంగా బాధపడుతున్న ఆమె.. మార్చి 2న కేర్ ఆస్పత్రిలో చేరిన విషయం తెలిసిందే. 13 ఏళ్ల వయస్సులోనే సాయుధ పోరాటంలో పాల్గొన్న మల్లు స్వరాజ్యం.. తుపాకీ పట్టిన మొదటి మహిళగా పేరుతెచ్చుకున్నారు. ఆమె తుంగతుర్తి నియోజకవర్గం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

Advertisement

Next Story